Begin typing your search above and press return to search.

నాకు నేనే బెంచ్ మార్క్-అఖిల్

By:  Tupaki Desk   |   17 Oct 2015 11:00 PM IST
నాకు నేనే బెంచ్ మార్క్-అఖిల్
X
డ్యాన్సుల విషయంలో తాను ఎవరినో అందుకోవడానికి ప్రయత్నించలేదని.. తనకు తానే బెంచ్ మార్క్ కావాలనుకున్నానని చెప్పాడు అక్కినేని యువ కథానాయకుడు అఖిల్. హీరోగా అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’లో అతడి డ్యాన్సుల గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అభిమానులతో అఖిల్ ట్విట్టర్ చాట్ సందర్భంగానూ ఈ విషయం చర్చకు వచ్చింది. డ్యాన్సుల విషయంలో మరీ అంత కష్టపడ్డారేంటి అని ఓ అభిమాని అడగ్గా.. ‘‘అఖిల్ సినిమా మొదలవడానికి చాలా కాలం కిందటే నేను డ్యాన్సుల్లో హార్డ్ ట్రైనింగ్ తీసుకున్నా. నాకు నేను బెంచ్ మార్క్ కావాలని హై స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నా. డ్యాన్సుల విషయంలో అభిమానులు ఏమాత్రం నిరాశ చెందరు’’ అని అఖిల్ చెప్పాడు.

అఖిల్ వాయిదా పడ్డానికి ఇంకేవైనా కారణాలున్నాయా అని ఓ అభిమాని అడగ్గా.. ‘‘గ్రాఫిక్ వర్క్ తప్ప ఇంకే కారణమూ లేదు. దాని వల్లే విడుదల ఆలస్యమవుతోంది. సినిమా వాయిదా పడ్డం వల్ల అభిమానులు ఎంత నిరాశ చెంది ఉంటారో అర్థం చేసుకోగలను. దీనికి మనస్పూర్తిగా సారీ చెబుతున్నా. ఐతే ఫైనల్ ఔట్ పుట్ మాత్రం టాప్ క్లాస్ గా ఉంటుంది. మీరు కచ్చితంగా చాలా చాలా సంతోషిస్తారు’’ అని చెప్పాడు అఖిల్. సినిమా వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకున్నది గురువారం రాత్రేనని.. అంతకుముందు తమకా ఆలోచన లేదని.. కాబట్టి తర్వాతి విడుదల తేదీపై తమకే క్లారిటీ లేదని.. కాబట్టి కొన్ని రోజుల తర్వాత వెల్లడిస్తామని.. అభిమానులు ఓపిగ్గా ఉండాలని అఖిల్ కోరాడు.