Begin typing your search above and press return to search.

డ‌బుల్ గేమింగ్ లో మాయావి మాంత్రిక విద్య‌లు

By:  Tupaki Desk   |   2 Nov 2020 10:30 AM IST
డ‌బుల్ గేమింగ్ లో మాయావి మాంత్రిక విద్య‌లు
X
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కున్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని స్టార్ హీరోలు ఎదురుచూస్తుంటారు. ఆయ‌న తెర‌పై హీరోల‌ని చూపించే విధానం.. క్యారెక్ట‌రైజేష‌న్‌.. హీరో పాత్ర తో చెప్పించే పంచ్ డైలాగ్ లు చాలా ప్ర‌త్యేకంగా వుంటాయి. అందుకే త్రివిక్ర‌మ్ తో క‌లిసి చేయాల‌ని స్టార్ హీరోలు ఎదురుచూస్తుంటారు.

స్టార్ హీరోల‌తో పాటు అప్ ‌క‌మింగ్ హీరోల వ‌ర‌కు ఇదే త‌ర‌హాలో ఆలోచిస్తుంటారు. దీంతో త్రివిక్ర‌మ్ టాలీవుడ్ లో హాట్ ఫేవ‌రేట్ గా మారిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి అఖిల్ వ‌ర‌కు ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ ఓ భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` కార‌ణంగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది.

వ‌న్స్ ఎన్టీఆర్ సినిమా పూర్త‌యితే ఆ వెంట‌నే మ‌హేష్ లైన్ లోకి రాబోతున్నాడు. రామ్ ‌చ‌ర‌ణ్ కూడా త్రివిక్ర‌మ్ తో చేయాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. అంతే కాకుండా మెగాస్టార్ .. అఖిల్ కూడా లైన్ లో వున్నారు. అఖిల్ రెండ‌వ చిత్రాన్నే త్రి‌విక్ర‌మ్ తో చేయాల‌ని నాగార్జున ప్లాన్ చేశారు కానీ సెట్ట‌వ‌లేదు.. దీంతో ఈసారి ఎలాగైనా త్రివిక్ర‌మ్ తో అఖిల్ హీరోగా సినిమా చేయాల్సిందే అని నాగ్ ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. మ‌హేష్ తో సినిమా త‌రువాత అఖిల్ తో త్రివిక్ర‌మ్ సినిమా చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక‌పోతే ఇన్ని ఉన్నా.. ఇప్ప‌టికీ వేరే హీరోల‌కు త్రివిక్ర‌మ్ క‌థ‌లు మాట‌లు అందిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. డైరెక్ట‌ర్ గా 20 కోట్లు పైగా అందుకుంటున్న మాయావి ర‌చ‌యిత‌గా 10 కోట్ల వ‌ర‌కూ లాగేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్. మ‌రి అగ్ర హీరోల‌తో సినిమాలు చేయాలి... కుర్ర‌హీరోల‌కు క‌థ‌లు అందించాల‌న్న మాయావి డ‌బుల్ గేమింగ్ ప్లాన్ ని మెచ్చుకుని తీరాల్సిందే.