Begin typing your search above and press return to search.

వారం తర్వాత అఖిల్ హలో!!

By:  Tupaki Desk   |   15 Sep 2017 2:23 PM GMT
వారం తర్వాత అఖిల్ హలో!!
X
అక్కినేని వంశానికి లేటెస్ట్ వారసుడు అఖిల్ రెండో సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మొదటి సినిమా అఖిల్ పరాజయం తర్వాత.. రెండో చిత్రం ప్రారంభించడానికి టైం తీసుకున్నా.. ఒకసారి మొదలుపెట్టాక మాత్రం మాంచి స్పీడ్ తో కంప్లీట్ చేసేస్తున్నారు. ఇప్పటికే హైద్రాబాద్ మెట్రో రైల్ లో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా రికార్డ్ సృష్టించిన 'హలో'.,. ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎడ్వంచర్ గా ఉండనుందని టాక్. అయితే.. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం కొన్ని నెలలుగా బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్నా.. రీసెంట్ గా ఓ వారం నుంచి మాత్రం అఖిల్.. సినిమా యూనిట్ నుంచి మిస్ అయ్యాడు. ఇందుకు కారణం రీసెంట్ గా అఖిల్ అనారోగ్యానికి గురి కావడమే. సడెన్ గా అస్వస్థత పాలవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కు బ్రేక్ వేసి రెస్ట్ తీసుకున్న అఖిల్.. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్ స్పాట్ కు వచ్చేశాడు. అదే విషయాన్ని ఓ సెల్ఫీ తీసుకుని మరీ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు అఖిల్.

"అనారోగ్యం కారణంగా ఓ వారం పాటు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ కి వచ్చేశా. ఇలాంటి లవ్లీ వాతావరణంలో షూటింగ్ చేయడం సూపర్బ్ గా ఉంది. ఇప్పుడు నేను ఎవరితో షూటింగ్ లో పాల్గొనబోతున్నానా ఏమైనా ఊహించగలరా?" అంటూ జనాలకు ఓ పజిల్ కూడా విసిరాడు అఖిల్. ఈ పజిల్ కి ఇంకా ఆన్సర్ దొరకలేదు.. అఖిల్ కూడా ఇవ్వలేదు కానీ.. అక్కినేని వారసుడు తిరిగి పూర్తి అరోగ్యం సంతరించుకోవడంతో.. అభిమానులు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.