Begin typing your search above and press return to search.

హలో.. ఓవర్సీస్ రైట్స్ కు ఎంతంటే

By:  Tupaki Desk   |   9 Oct 2017 10:10 AM IST
హలో.. ఓవర్సీస్ రైట్స్ కు ఎంతంటే
X
అక్కినేని వారింటి నట వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన మరో హీరో.. అఖిల్ కు మొదటి సినిమాతోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అఖిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో అతడి కెరీర్ ను గాడిన పడేలా చూసే బాధ్యత తండ్రి నాగార్జున తలకెత్తుకున్నాడు. బోలెడు కథలు విని చివరకు తన ఫ్యామిలీకి కలకాలం గుర్తుండిపోయే డీసెంట్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ కు అవకాశం ఇచ్చాడు. అఖిల్ ను రీలాంచ్ చేస్తూ విక్రమ్ కె.కుమార్ తీస్తున్న హలో సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది.

విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ పై ఉన్న నమ్మకంతో హలో సినిమా థియేటరికల్ రైట్స్ కు క్రేజీ ఆఫర్లే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ కు ఊహించని ధర వచ్చింది. హలో సినిమాకు రూ. 5 కోట్ల వరకు చెల్లించేందుకు ఓ డిస్ట్రిబ్యూటర్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ డెబ్యూ మూవీ ఓవర్సీస్ లో భారీ నష్టాన్నే మూటగ్టటుకుంది. దాని ప్రభావం ఏ మాత్రం లేకుండా హలో సినిమాకు భారీమొత్తం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం ఈ సినిమాకు ఏర్పడిన పాజిటివ్ బజ్ కు అద్దం పడుతోంది.

లవ్ స్టోరీలను డీల్ చేయడంలో విక్రమ్ కె.కుమార్ ది ప్రత్యేకమైన స్టయిల్. ఇష్క్ - మనం సినిమాల్లో ప్రేమకథలు డీల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హలో సినిమా కూడా న్యూ ఏజ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా చెబుతున్నారు. దీనికితోడు అడ్వాన్సడ్ టెక్నికల్ వాల్యూస్ తో తీస్తున్నామని నిర్మాత నాగార్జున చెప్పుకొచ్చారు. దీంతో అఖిల్ కమ్ బ్యాక్ మూవీపై రానురానూ అంచనాలు పెరుగుతున్నాయి.