Begin typing your search above and press return to search.

హలో.. రేంజ్ పెరగాలని వైజాగ్ లో..

By:  Tupaki Desk   |   5 Dec 2017 7:34 AM GMT
హలో.. రేంజ్ పెరగాలని వైజాగ్ లో..
X
బాక్స్ ఆఫీస్ కి హలో చెప్పి అందరిని మెప్పించాలంటే అంత సులువైన విషయం కాదు. అందుకు చాలా కష్టపడాలి. ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోలకు తెలియనిది కాదు. ఇకపోతే స్టార్ హీరో నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ కూడా చాలా కష్టపడుతున్నాడనే చెప్పాలి. మొదటి సినిమా కోసం ఎంత కష్టపడినా ఇతర కారణాలు అతని కెరీర్ ని దెబ్బ కొట్టాయి. కానీ సెకండ్ మూవీ హలో తప్పకుండా హిట్ కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

తండ్రి నాగార్జున కూడా హలో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపోతే సెంటిమెంట్స్ నీ కూడా నాగ్ చాలానే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ ని హై రేంజ్ లో పెంచుతున్నాడు. సినీ తారల హెల్ప్ కూడా తీసుకుంటున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో మరో పెద్ద బాధ్యతని నాగ్ ఫేస్ చేయబోతున్నారు. అదే ఆడియో వేడుక. సినిమా రేంజ్ ని మరో మెట్టు ఎక్కించాలంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చాలా ముఖ్యం.

అభిమానులు కూడా అందుకోసమే ఎదురుచూస్తున్నారు. అయితే నాగ్ వైజాగ్ లోనే వేడుకను నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. ఉత్తరాంధ్ర లో నాగార్జున మంచి హిట్స్ ని కూడా అందుకున్నారు. వారి ఫ్యామిలీ సినిమాలు అక్కడ మినిమమ్ వసూళ్లను సాధిస్తాయి. దీంతో అక్కడ హైప్ క్రియేట్ చేస్తే తప్పకుండా సినిమా స్థాయి పెరుగుతుందని నాగ్ వైజాగ్ లో ఆడియో వేడుకకు ఏర్పాట్లు చెయ్యాలని డిసైడ్ అయ్యారట. వేడుకకి సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.