Begin typing your search above and press return to search.

ఇంటర్నేషనల్ అవార్డుకు అఖిల్ సినిమా

By:  Tupaki Desk   |   14 May 2018 10:47 AM GMT
ఇంటర్నేషనల్ అవార్డుకు అఖిల్ సినిమా
X
‘అఖిల్’ సినిమాతో ఎదురు దెబ్బ తిన్న అక్కినేని అఖిల్‌ను ‘హలో’ సినిమాతో రీలాంచ్ చేయించాడు అక్కినేని నాగార్జున. తన కుటుంబానికి ‘మనం’తో మరపురాని విజయాన్నందించిన విక్రమ్ కుమార్‌ను దర్శకుడిగా పెట్టుకుని ఎంతో శ్రద్ధగా ఈ సినిమాను తెరకెక్కించాడు నాగ్. కచ్చితంగా కొడుక్కి నాగ్ ఓ హిట్ ఇవ్వబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఇది కూడా డిజాస్టర్‌ గానే మిగిలింది. వరుస విజయాల్లో ఉన్న విక్రమ్ కుమార్‌కు ఈ ఫలితం ఒక పెద్ద షాక్. దాన్నుంచి అతను కోలుకుని తన తర్వాతి సినిమాపై దృష్టిపెట్టాడు. ‘హలో’ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినప్పటికీ.. ఈ చిత్ర బృందానికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ అవార్డు రేసులో నిలవడం విశేషం.

వరల్డ్ స్టంట్స్ ఇంటర్నేషనల్ అవార్డుల్లో ‘హలో’ విదేశీ సినిమా కేటగిరీలో అవార్డుకు పోటీలో నిలిచింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా విక్రమ్ కుమార్ వెల్లడించాడు. ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. అఖిల్ దీని కోసం చాలా చాలా కష్టపడ్డాడు. ఎన్నో సాహసాలు చేశాడు. ఇందులోని యాక్షన్ దృశ్యాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చాయి. ఆ ఎపిసోడ్ సినిమాలో సింక్ కాకపోయినప్పటికీ ఆకర్షణగా మాత్రం నిలిచింది. మరి కేవలం నామినేషన్‌తో సరిపెడతారా.. అవార్డు కూడా వస్తుందా అన్నది చూడాలి. ‘హలో’ తర్వాత అఖిల్.. ‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేయడానికి రెడీ అవుతుండగా.. విక్రమ్ కుమార్ అల్లు అర్జున్‌ కోసం ఒక కథ రెడీ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.