Begin typing your search above and press return to search.

హలో.. అఖిల్ హైలెట్ అదేనట

By:  Tupaki Desk   |   28 Oct 2017 5:53 PM GMT
హలో.. అఖిల్ హైలెట్ అదేనట
X

అఖిల్ సినిమాతో మొదటి సినిమాతోనే అపజయాన్ని అందుకున్న అక్కినేని అఖిల్ రెండవ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. ఎటువంటి ప్రయోగాలకు పోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా అక్కినేని వారసుడు హలో సినిమాను చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మంచి హిట్ ని ఇచ్చిన విక్రమ్ కుమార్ హలో సినిమాని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ తో చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది. నాగార్జున కూడా ప్రతి చిన్న విషయంలో తన వరకు ఉన్న అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. సినిమాను కూడా ఆయనే రిచ్ గా నిర్మిస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించనున్నాడట. ఫైట్స్ విషయంలోనే కాకుండా డ్యాన్సుల విషయంలో కూడా కుర్ర హీరో ప్రత్యేకంగా శిక్షణను తీసుకొని మరి స్టెప్పులేస్తున్నాడట.

చిత్రంలో హైలెట్ గా నిలిచే ఒక సాంగ్ కోసం అఖిల్ గత కొంత కాలంగా చాలా కష్టపడి స్టెప్పులను ప్రాక్టీస్ చేశాడట. రీసెంట్ గా సాంగ్ షూటింగ్ లో చిత్ర యూనిట్ అఖిల్ స్టెప్పులను చూసి ఆశ్చర్యపోయారట. బ్రేక్ లేకుండా అఖిల్ చేసిన డ్యాన్స్ సూపర్బ్ అంటూ చిత్ర యానిట్ చప్పట్లు కొట్టిందని తెలుస్తోంది. ఇక ఫైనల్ షెడ్యూల్ పూర్తికాగానే నెక్స్ట్ మంత్ నుంచి ప్రమోషన్స్ ని ఎక్కువగా చెయ్యాలని నాగ్ అనుకుంటున్నాడట. అఖిల్ సరసన కళ్యాణ్ ప్రియదర్శన్ నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.