Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సైకిల్‌ ప్రేమాయణం

By:  Tupaki Desk   |   17 Aug 2015 7:09 AM GMT
ఫోటో స్టోరి: సైకిల్‌ ప్రేమాయణం
X
సైక్లోటూర్‌ .. ఈ పదం వినడానికి ఎంత బావుందో, ఆచరించడానికి అంతే బావుంటుంది. సైకిల్‌, టూర్‌ అనే రెండు పదాల్ని కలిపి ఒక పదంగా ఇలా పిలుస్తున్నారన్నమాట. ఇదిగో ఇక్కడున్న పిక్‌ లో ఓ అందమైన అమ్మాయి, అబ్బాయి సైక్లోటూర్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. అఖిల్‌ అందాల భామ సయేషా సైగల్‌ తో సైకిల్‌ టూర్‌ వెళుతున్నాడన్నమాట! ఓ అందమైన పార్క్‌ లో ఇలా అందాల భామతో టూర్‌ అంటే ఆ టీనేజర్‌ మనసు ఎంత ఎగ్జయిట్‌ మెంట్‌ లో ఉంటుందో?

అసలింతకీ సయేషా ఎటో చూపిస్తూ ఏం చెబుతోంది? ఆ అందమైన వనం చూడు. ప్రేమపక్షుల విహారానికి ఎంత అనువుగా ఉందో కదూ! అంటూ అఖిల్‌ కి చెబుతోందా? కోమలాంగి చెబుతున్నదంతా బుద్ధిమంతుడిలా వింటున్నట్టే కనిపిస్తున్నా మనసులో బోలెడంత కల్లోలం చెలరేగుతోందన్న సంగతిని ఆ భామ ఎందుకు పసిగట్టదూ? ఐరోపా చుట్టొచ్చినప్పుడు ప్యారిస్‌ లో వనవిహారం చేసినప్పుడు ఇలాంటి గొప్ప అనుభవాన్ని ఆస్వాధించారు ఈ యువజంట. అఖిల్‌ సినిమా టీజర్‌ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్‌ పుట్టినరోజు (ఈనెల 29న) వస్తుందని తెలిసిన విషయమే.