Begin typing your search above and press return to search.

అఖిల్‌ సినిమా టీజరొచ్చేస్తోందహో..

By:  Tupaki Desk   |   7 April 2015 5:00 PM IST
అఖిల్‌ సినిమా టీజరొచ్చేస్తోందహో..
X
ఈ ఏడాది అందరూ ఎదురు చూస్తున్న అరంగేట్రం అంటే అది అక్కినేని అఖిల్‌దే. తొలి సినిమా మొదలెట్టడానికి ముందే వీర లెవెల్లో ఫాలోయింగ్‌ తెచ్చేసుకున్న సిసింద్రీ రెండు నెలల కిందట రంగంలోకి దిగిపోయాడు. ఏడాదిపాటు కసరత్తులు చేసి చేసి పక్కాగా స్క్రిప్టు తయారు చేసిన వి.వి.వినాయక్‌ శరవేగంగా షూటింగ్‌ కానిచ్చేస్తున్నాడు. ఇంతలోనే అఖిల్‌ సినిమా టీజర్‌ కూడా రెడీ అయిపోయింది. అందరినీ ఆశ్చర్యానికి గురించి చేస్తూ సడెన్‌గా టీజర్‌ లాంచ్‌ గురించి అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశాడు ఈ సినిమా నిర్మాత నితిన్‌.

ఏప్రిల్‌ 8న అఖిల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అఖిల్‌ తొలి సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు నితిన్‌ ప్రకటించాడు. ఈ సినిమాలో అఖిల్‌ సరసన ఆయేషా సైగల్‌ అనే బాలీవుడ్‌ అమ్మాయి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ మూవీ అని ప్రచారం జరిగింది కానీ.. ఇదో మామూలు మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ అని చెబుతున్నాయి యూనిట్‌ వర్గాలు. షూటింగ్‌ మొదలెట్టడమే అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలు ఏ ఇబ్బందీ లేకుండా చేసేశాడట అఖిల్‌. ఇంతకీ తెరమీద అక్కినేని వారసుడి తొలి చూపు ఎలా ఉండబోతుందో చూడాలి.