Begin typing your search above and press return to search.

సామ్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్

By:  Tupaki Desk   |   8 Sept 2018 12:02 PM IST
సామ్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్
X
అక్కినేని ఫ్యామిలీ లో అఖిల్ చిన్నవాడే గానీ హంగామా అంతా అఖిల్ బాబు దగ్గరే ఉంటుంది. అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు కదా. అఖిల్ కి వెంకీకి గొడవలు వచ్చాయని రూమర్స్ వస్తే ఇద్దరూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసి విమర్శకుల నోళ్ళు మూయించిన సంగతి గుర్తుంది కదా. అది ఒకరకమైన అల్లరి. తాజాగా వదినమ్మ సమంతా కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు.

సమంతా తాజా చిత్రం 'U టర్న్' సెప్టెంబర్ 13 న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'కర్మ' అనే థీమ్ సాంగ్ ను 'U టర్న్' టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ థీమ్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. చాలామంది పిల్లలు సమంతా డ్యాన్స్ ను ఇమిటేట్ చేస్తూ 'కర్మ' పాట వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అఖిల్ కూడా కర్మ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి "ఈ వీడియో నా వన్ అండ్ ఓన్లీ వదినమ్మ సమంతా కోసం" అని క్యాప్షన్ పెట్టాడు.

ఇక వీడియోలో డ్యాన్స్ అయితే దుమ్ము దులిపాడు. హోమ్ థియేటర్ లో బ్యాక్ గ్రౌండ్ లో కర్మ సాంగ్ ప్లే అవుతూ ఉంటే స్క్రీన్ ముందు అఖిల్ ఎగ్జాక్ట్ గా సమంతా డ్యాన్స్ ను ఇమిటేట్ చేస్తూవేసిన స్టెప్స్ అదిరిపోయాయి. డ్యాన్స్ అంతా అయిన తరవాత 'U టర్న్' సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. వదినమ్మకే కాదు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక స్వీట్ సర్ ప్రైజ్ అనడం లో ఆశ్చర్యం లేదు. మీరు ఆ వీడియో పై ఓ లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి