Begin typing your search above and press return to search.

బర్త్ డే రోజున ఫాన్స్ ని నిరాశ పరిచిన అఖిల్

By:  Tupaki Desk   |   7 April 2020 4:30 PM GMT
బర్త్ డే రోజున ఫాన్స్ ని నిరాశ పరిచిన అఖిల్
X
టాలీవుడ్ లో ఇప్పటివరకు ఫస్ట్ సినిమా నుండి కూడా సరైన హిట్ ను అందుకోలేకపోయాడు అక్కినేని అఖిల్. ఇప్పటికే మూడు సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా తనకు బ్లాక్ బస్టర్ రుచిని చూపించలేకపోయాయి. కానీ అఖిల్ కి అభిమానుల ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. తండ్రి అక్కినేని నాగార్జున, అన్న నాగచైతన్య అభిమానులు ఒక మంచి సినిమాతో వస్తే ఆదరించడానికి సిద్దంగానే ఉన్నారు. కానీ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఆలోచనలో పడ్డారు. మిస్టర్ మజ్ను సినిమా అనంతరం చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ కథను ఓకే చేసాడు అఖిల్. కానీ బొమ్మరిల్లు భాస్కర్ కూడా వరుస ప్లాపులలో ఉండటంతో అభిమానులలో అక్కినేని అభిమానులలో ఆందోళన మొదలైంది.

ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే రేపు(ఏప్రిల్ 8) అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన సినిమా గురించి ఏదైనా పోస్టర్, టీజర్ విడుదల చేస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అఖిల్ సోషల్ మీడియా ద్వారా వీడియో రూపంలో స్పందిస్తూ.. రేపు పుట్టినరోజున ఎలాంటి పోస్టర్, టీజర్ రిలీజ్ చేయట్లేదని తెలిపాడు. అంతేగాక ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరి ఇళ్లలో వారుండి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ విషయం తెలిసి అఖిల్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ చివరగా ఫ్యామిలీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని - మీరు కూడా మంచి ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేయండని ఫ్యాన్స్ కి పిలుపునిచ్చాడు.