Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కథను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చిన అఖిల్..?

By:  Tupaki Desk   |   9 March 2021 3:16 PM IST
బాలీవుడ్ కథను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చిన అఖిల్..?
X
అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' పూర్తైన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే '#అఖిల్5' సినిమాకు సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అఖిల్ - సూరి కాంబోలో రాబోయేది హిందీ సూపర్ హిట్ సినిమా రీమేక్ అని టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ - దీపికా పదుకునే జంటగా నటించిన ‘యే జవానీ హై దివానీ’ మూవీ అయితే అఖిల్‌ కి ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో రచయిత వక్కంతం వంశీ రెడీ చేస్తోంది సొంత స్టోరీ కాదని.. బాలీవుడ్ కథపై అని టాక్ నడుస్తోంది. వాస్తవానికి 'అఖిల్' ప్లాప్ తర్వాత 'యే జవానీ హై దివానీ' చిత్రాన్ని అఖిల్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించారు. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి హిందీ రీమేక్ తెరపైకి వచ్చింది. మరి '#AKHIL5' సినిమా విషయంలో వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.