Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్: షర్ట్ విప్పేసి సిగరెట్ తాగుతున్న స్టైలిష్ 'ఏజెంట్' 

By:  Tupaki Desk   |   8 April 2022 4:28 AM GMT
బర్త్ డే స్పెషల్: షర్ట్ విప్పేసి సిగరెట్ తాగుతున్న స్టైలిష్ ఏజెంట్ 
X
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''ఏజెంట్''. స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మాణంలో స్టైలిష్ ఫిలిం మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన 'ఏజెంట్' ఫస్ట్ లుక్ మరియు ఇతర స్పెషల్ పోస్టర్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నేడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ ని ఆవిష్కరించారు.

ఇందులో అఖిల్ షర్ట్ లేకుండా తన హల్కీ ఫిగర్‌ ని ప్రదర్శిస్తున్నాడు. సిగరెట్ తాగుతూ తన యాటిట్యూడ్ చూపిస్తున్న అఖిల్ కళ్ళలో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. పొడవాటి జుట్టు మరియు గుబురు గడ్డంతో సరికొత్తగా ఉన్నాడు.

'ఏజెంట్' చిత్రం కోసం అఖిల్ యొక్క అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్.. తన పాత్ర కోసం పడిన కష్టమంతా ఈ పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ లో భారీగా మంటలు చెలరేగుతూ అతనిలోని ఫైర్ ను సూచిస్తోంది. అయితే బర్త్ డేకి అందరూ టీజర్ ఎక్సపెక్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో అనిల్ సుంకర ట్వీట్ చేస్తూ.. ''ఈ రోజు 'ఏజెంట్' టీజర్ విడుదల చేయలేకపోతున్నందుకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ పెద్ద సారీ. మేం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగా ఉంటుంది. మే నెలలో హయ్యస్ట్ క్వాలిటీ థియేట్రికల్ టీజర్ విడుదల చేస్తాం" అని పేర్కొన్నారు.

ఇకపోతే ఈ సినిమాలో అఖిల్ ఒక స్పై గా కనిపించనున్నారు. క్యారెక్టర్‌ కి తగ్గట్టుగా అఖిల్‌ పూర్తిగా మేకోవర్‌ చేసుకున్నాడు. ఈ యాక్షన్-ప్యాక్డ్ రోల్ అతనిలోని సరికొత్త కోణాన్ని బయటకు తీస్తుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

స్పై థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న 'ఏజెంట్' చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారు.

రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిజా ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. అజయ్ సుంకర - పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఏజెంట్' సినిమాని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.