Begin typing your search above and press return to search.

మిస్టర్ మజ్ను గా అఖిల్ !

By:  Tupaki Desk   |   27 May 2018 5:06 PM GMT
మిస్టర్ మజ్ను గా అఖిల్ !
X
హీరోగా మొద‌టి సినిమా అఖిల్‌ ను బాగా నిరాశ ప‌రిచింది. రెండో సినిమా క‌లెక్ష‌న్లు తెచ్చినా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం కాలేక‌పోయింది. ఇక మూడో సినిమా అయినా జ‌నాల మ‌దిలో నాటేయాల‌ని అఖిల్ ఫిక్స‌యిపోయాడు. అందుకే *తొలి ప్రేమ‌* వంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీని తెర‌కెక్కించిన వెంకీ అట్లూరితో జ‌త క‌ట్టాడు. ఎక్క‌వ‌గా విదేశీ సీన్లు ఉండ‌బోతున్న ఈ సినిమా యూత్‌ను క‌ట్టిప‌డేస్తుందంటున్నారు. దానికి త‌గ్గ‌ట్టే యూర‌ప్ లో మంచి లొకేష‌న్లు కూడా చూసుకుని అంతా సెట్ చేసేశారు... ఇక షూటింగే మిగిలిన ఈ సినిమాకు ఇంత‌వ‌ర‌కు టైటిల్ అధికారికంగా ఖ‌రారు చేయ‌లేదు.

తాజాగా ఒక టైటిల్ అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. *మిస్ట‌ర్ మజ్ను * టైటిల్ అయితే బాగుంటుంది అనుకుంటున్నార‌ట‌. ఈ టాక్ గ‌ట్టిగానే వినిపిస్తోంది. టైటిల్‌లో ఈజ్ ఉన్నా... అఖిల్‌ మూడు సినిమాల టైటిల్స్ విష‌యంలో పెద్ద క్రేజ్ అయితే లేదు. సొంత‌ పేరు సెంటిమెంట్ దెబ్బ‌తిన్నాక రెండో సినిమా టైటిల్ క్యాచీగా పెట్టినా చాలా సింపుల్‌గా ఉంది. స్టోరీక‌యితే జ‌స్టిఫై చేసింది. బ‌ట్ క్రియేటివ్‌ గా అనిపించ‌లేదు. ఇపుడు మూడో సినిమాకు మిస్ట‌ర్ మజ్ను అంటున్నారు. ఇది కూడా ఎటువంటి బ‌జ్‌ ను క్రియేట్ చేసే టైటిల్ కాదు. పైగా మంచి యూత్‌ ఫుల్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ కి ఈ పేరు వ‌ల్ల కొత్త‌గా ఏం క‌లిసొచ్చే అవ‌కాశం లేదు. దీన్ని బ‌ట్టి మ‌రి ఈ పేరును ఖ‌రారు చేస్తారా అన్న అనుమానం ఉంది.

ఇదిలా ఉండ‌గా... జూన్‌ లో ఈ సినిమా షూటింగ్ మొద‌లుకానుంది. చ‌క్క‌టి లొకేష‌న్ల‌లో కొన్ని పాట‌లు చిత్రీక‌రిస్తున్నార‌ట‌. చాలా వ‌ర‌కు సీన్లు కూడా లండ‌న్‌ లో తీయ‌నున్నారు.