Begin typing your search above and press return to search.

అఖిల్ అండ్ రకుల్.. ఫ్రేమ్‌ అదిరింది

By:  Tupaki Desk   |   6 Jan 2016 11:34 AM GMT
అఖిల్ అండ్ రకుల్.. ఫ్రేమ్‌ అదిరింది
X
అఖిల్ అండ్ రకుల్.. భలేగున్నారే! టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ అక్కినేని వారసుడు అఖిల్. మొదటి మూవీ అఖిల్ డిజాస్టర్ అయినంత మాత్రాన.. అఖిల్ సృష్టించిన సంచలనాలను తక్కువ అంచనా వేయకూడదు. భవిష్యత్తులోనూ ఈ అక్కినేని వారసుడు చాలానే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడనే అంచనాలున్నాయి.

మరోవైపు.. టాలీవుడ్ లో టాప్ యంగ్ హీరోయిన్ స్థాయిలో వెలిగిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ చిన్నదానికి ఖాతాలో బ్లాక్ బస్టర్ లేకపోయినా.. అవకాశాలు అందుకోవడంలోను, రెమ్యూనరేషన్ రికార్డుల్లోనూ సెన్సేషన్స్ చాలానే సృష్టిస్తోంది. మరి అక్కినేని అఖిల్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఇద్దరినీ కలిపి చూడకుండా.. ఇలా అడిగితే ఎలా చెప్పడం అనుకోవచ్చు. కానీ రీసెంట్ గా హైద్రాబాద్ లోని అత్తాపూర్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభానికి అఖిల్ - రకుల్ లు కలిసి వచ్చారు. ఇద్దరూ కలిసే ఓపెనింగ్ చేశారు. షోరూం అంతా ఇద్దరూ కలియదిరిగారు. పక్కపక్కనే నుంచుని జోకులేసుకుంటూ నవ్వుకుంటూ.. చూసినోళ్లకి ముచ్చటగా కనిపించారు.

బేసిక్ గా ఇద్దరూ వైట్ స్కిన్ కావడంతో.. కాంబినేషన్ మరింత సూపర్బ్ గా అనిపించింది. వీళ్లిద్దరూ పక్కపక్కన ఉంటే ఇంత అందంగా ఉంటారా అనుకున్నారు చాలామంది. ఇక ఈ ఫోటోలు చూసినోళ్లయితే.. వీరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ పై ఇంకా అందంగా ఉంటుందని తేల్చేశారు. మొత్తానికి ఇలా ఓ కాంబినేషన్ ని ముందే చూపించారన్న మాట.