Begin typing your search above and press return to search.

యన్టీఆర్ తరువాత బిగ్ బాస్ లు ఈ ఇద్దరే!

By:  Tupaki Desk   |   22 Sept 2017 12:07 PM IST
యన్టీఆర్ తరువాత బిగ్ బాస్ లు ఈ ఇద్దరే!
X
జూనియర్ యన్టీఆర్ బిగ్ బాస్ షో హోస్ట్ చేసిన తరువాత అతడి పాపులారిటీ ఇంకా పెరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని జూనియర్ కి బాగా కనెక్ట్ చేసిన ఈ రియాల్టీ షో దాదాపు చివరి దశకు చెరుకుంది. అయితే హిందీ బిగ్ బాస్ మాదిరిగానే తెలుగు బిగ్ బాస్ ని కూడా పలు సీజన్లుగా నిర్వహించేందుకు స్టార్ గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. కానీ యన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2ని హోస్ట్ చేస్తాడా లేదా అనే విషయం పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

తారక్ ఇంట్రెస్ట్ చూపితే వచ్చే సీజన్ కూడా అతనితోనే హోస్ట్ చేయించే ప్లానింగ్ లో స్టార్ గ్రూప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తారక్ మళ్లీ హోస్ట్ గా చేసేందుకు ఒప్పుకోకపోతే మాత్రం అతడి స్థానంలోకి ఇద్దరు యంగ్ హీరోలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

వచ్చే సీజన్స్ సెలబ్స్ తో కామన్ ఆడియెన్స్ కూడా బిగ్ బాస్ లో పార్టిస్ పేట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరైనా మీడియం రేంజ్ హీరోలు ఈ షోని హోస్ట్ చేస్తే బావుంటుందనే ఆలోచనలో స్టార్ గ్రూప్ వారు ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ముందుగా అక్కినేని బుల్లోడు అఖిల్ తో ఓ సీజన్ ని హోస్ట్ చేయించి - ఆ తరువాత అవకాశం నానికి ఇచ్చేలా సన్నాహాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!