Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ:అలరిస్తున్న బుల్లి బంగార్రాజులు

By:  Tupaki Desk   |   11 Jan 2016 11:13 AM GMT
ఫోటో స్టొరీ:అలరిస్తున్న బుల్లి బంగార్రాజులు
X

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న నాలుగు సినిమాలలో అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికే ఫ్యామిలీ ఆడియన్ల ఓటు అనడంలో సందేహం లేదు. డిక్టేటర్ పూర్తి మాస్ మూవీ, సుక్కు - తారక్ ల రిజల్ట్ మల్టీప్లక్స్ ని ఎక్కువ ఆధారపడి వుంది. శర్వా సినిమా పూర్తి మౌత్ టాక్ బేస్డ్.. కాబట్టే నాగ్ ఈ సినిమాల మధ్య తన సోగ్గాడిని ధైర్యంగా విడుదల చేస్తున్నాడు.

ప్రమోషన్లలో కొత్త పుంతలు తొక్కుతూ ఆడియో ఫంక్షన్ లో ట్రైలర్ ని ఎనాక్ట్ చేసి, విడుదలకు ముందే దాదాపు కధంతా చెప్పేసి, మీలో ఎవరు కోటీశ్వరుడుతో హీరోయిన్లను దించేసి విడుదలకు తన వంతు కష్టపడుతున్న నాగ్ కి తన కొడుకులు సైతం సహాయం చేస్తున్నారు.

సోగ్గాడి సినిమాలో మెయిన్ రోల్ గా నిలవనున్న బంగార్రాజు వేషధారణని తలపిస్తూ నాగ్ తనయులు చైతూ, అఖిల్ లు పూర్తి సంప్రదాయబద్ధంగా పట్టు పంచెలలొ అలరించారు. ఈ పిక్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ సృష్టిస్తుంది. సోగ్గాడి కోసం పండక్కి దాదాపు 500 థియేటర్ లు సిద్ధంగా వున్నట్టు సమాచారం.