Begin typing your search above and press return to search.

బాగా స్ర్టెస్సుడ్‌ అవుట్‌ గా ఉన్నా - అఖిల్‌

By:  Tupaki Desk   |   12 Nov 2015 6:32 PM GMT
బాగా స్ర్టెస్సుడ్‌ అవుట్‌ గా ఉన్నా - అఖిల్‌
X
సినిమా రిలీజ్‌ అయిన రోజున అస్సలు అఖిల్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క ట్వీటు కూడా వేయలేదు. కనీసం ఎవ్వరితోనూ పెదవి విప్పలేదట. అయితే దీనంతటికీ కారణం ఏమైయుండొచ్చు? అదే విషయాన్ని అఖిల్‌ దగ్గర ప్రస్తావిస్తే.. వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు.

''ఇదే నా మొదటి సినిమా కావడంతో... రిలీజ్‌ అనగానే టెన్షన్‌ వచ్చేసింది. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. సినిమా టాక్‌ ఎలా ఉంది? కలెక్షన్లు ఎలా ఉన్నాయ్‌? ఇలాంటి విషయాలన్నీ నాకు కొత్త. కాకపోతే 9.8 కోట్లు వచ్చిందనగానే భయం వేసింది. మెంటల్‌ గా బాగా స్ర్టెస్‌ అయిపోయా. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నా. అందుకే ఏమీ మాట్లాడలేను. ప్రస్తుతం కేవలం అందరికీ థ్యాంక్స్‌ మాత్రం చెబుతున్నా...'' అంటూ చెప్పుకొచ్చాడు అఖిల్‌.

నిజమే కదండీ మరి.. తొలిసినిమానే 50 కోట్ల షుమారు వసూలు చేయాలంటే.. ఎవరికైనా ఇలాంటి టెన్షనే ఉంటుంది. సో.. అఖిల్‌ కూడా అలాగే టెన్షన్‌ పడుతున్నాడనమాట. సర్లేండి.. స్ర్టెస్‌ పడుతున్నా అంటూ అసలు ఓపెన్‌ గా చెప్పడమే ఒక గొప్ప క్వాలిటీ. ఏదేమైనా సినిమాకు సంబంధించి గేమ్‌ ఇలాగే ఉంటుంది. అవన్నీ అర్దం చేసుకొని మానసికంగా ఎడ్జస్ట్‌ అవ్వడానికి కాస్త టైమ్‌ పడుతుందిలే.