Begin typing your search above and press return to search.

ఏజెంట్ లుక్‌: పందేనికి పొట్టేలు రెడీ.. ముందుంది పండ‌గ‌!

By:  Tupaki Desk   |   11 July 2021 7:08 AM GMT
ఏజెంట్ లుక్‌: పందేనికి పొట్టేలు రెడీ.. ముందుంది పండ‌గ‌!
X
టాలీవుడ్ లో ఫేజ్ మారుతోంది. ఇప్పుడంతా ఫాన్ ఇండియా ఫీవ‌ర్ రాజుకుంటోంది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలంతా పాన్ ఇండియా సినిమాల‌తో కెరీర్ ప‌రంగా మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేయాల‌నుకుంటున్నారు. చూస్తుంటే అఖిల్ కూడా అదే బ్రాండ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. సైరా - న‌ర‌సింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమా చేసిన సురేంద‌ర్ రెడ్డితో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్లాన్ చేయ‌డం వెన‌క బిగ్ గేమ్ ప్లాన్ ఉంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. అఖిల్ ఇప్ప‌టికే నాలుగు సినిమాలు చేశాడు. ఐదో సినిమాగా సూరి ద‌ర్శ‌క‌త్వంలో `ఏజెంట్` మొద‌లైంది.

అఖిల్ అక్కినేని- సురేందర్ రెడ్డి- అనిల్ సుంకర క్రేజీ ప్రాజెక్ట్ ఏజెంట్ కి సంబంధించిన ప్ర‌తిదీ ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇప్ప‌టికే ఏజెంట్ ఫ‌స్ట్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మ‌రో కొత్త లుక్ ని రివీల్ చేయ‌గా యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. ఈ న‌యా లుక్ లో అఖిల్ బీస్ట్ ని త‌ల‌పిస్తున్నాడు. అత‌డు జిమ్ లో క‌ఠోర శిక్ష‌ణ తీసుకుని భారీ కాయుడిగా మారార‌ని ఈ లుక్ చెబుతోంది. భారీ షోల్డ‌ర్ బైసెప్ వెన‌క‌భాగం కండ‌రాల‌తో అత‌డు వీ షేప్ లో క‌నిపిస్తున్న తీరు భ‌య‌పెడుతోంది. ఆ మెడ‌కు దిగువ భాగంలో ఏజెంట్ సింబ‌ల్ చూస్తుంటే `పందేనికి సిద్ధంగా ఉన్న పొట్టేలు` ని ఎలివేట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇది స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ .. అఖిల్ కెరీర్ బెస్ట్ గా ఉంటుంద‌ని సూరి బృందం చెబుతోంది. ఈ చిత్రంలో అఖిల్ ని పూర్తిగా కొత్త వెర్షన్ లో చూపించాల‌న్న‌దే అత‌డి తాప‌త్ర‌యం అని అర్థ‌మ‌వుతోంది.

`ఏజెంట్ లోడింగ్` అంటూ తాజాగా కొత్త లుక్ ని రివీల్ చేశారు. ``ఇది ప్రారంభం మాత్రమే ... మీకు మునుముందు ఉంది పండ‌గ‌!!`` అని సూరి ట్వీట్ చేశారు. రెగ్యుల‌ర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని హింట్ ఇచ్చారు. చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లే చాలా ముందు నుంచి అఖిల్ జిమ్ లో శ్ర‌మించి కండ‌లు పెంచుతున్నారు. జిమ్ లో అఖిల్ తన కండరాలను మ‌లుచుకున్న తీరు ఆస‌క్తిక‌రం. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అఖిల్‌ను ప్రదర్శిస్తారని తాజా ఫోటోతో స్పష్టమైంది. ఇది ఇప్పటివరకు అఖిల్ బెస్ట్ గెట‌ప్ అని చెప్పాలి.

స్పై థ్రిల్లర్ లో అఖిల్ సరసన కొత్త‌మ్మాయి సాక్షి వైద్య న‌టిస్తోంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలీ ఎడిటర్ కాగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా ప‌ని చేస్తున్నారు. అజయ్ సుంకర- పాతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. ఎకె ఎంటర్ టైన్మెంట్స్ - సురేందర్ 2 సినిమా బ్యాన‌ర్ల‌లో రామబ్రహ్మం సుంకర- అనీల్ సుంక‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందించారు. దర్శక-రచయిత ద్వయం గతంలో కిక్- రేస్ గుర్రం వంటి కొన్ని బ్లాక్ బస్టర్ ల కోసం కలిసి పనిచేశారు. వారి కలయికలో మరో సూపర్ హిట్ ఖాయ‌మ‌ని అంచ‌నాలేర్ప‌డుతున్నాయి.