Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ ఫొటో షూట్‌ కంటే ఎక్కువ వైరల్‌ అవుతున్న హీరో స్టైలిష్‌ స్టిల్‌

By:  Tupaki Desk   |   29 July 2021 3:42 AM GMT
హీరోయిన్‌ ఫొటో షూట్‌ కంటే ఎక్కువ వైరల్‌ అవుతున్న హీరో స్టైలిష్‌ స్టిల్‌
X
సహజంగా హీరోయిన్స్‌ హాట్‌ ఫొటో షూట్స్‌.. క్యూట్‌ స్టిల్స్‌.. బికినీ పిక్స్‌.. సారి స్టిల్స్ ఇలా రకరకాలుగా ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. అమ్మాయిలు అందంగా కనిపిస్తే వాటిని షేర్‌ చేసేందుకు నెటిజన్స్‌ ఎగబడుతారు. కాని హీరోల ఫొటోల విషయంలో మాత్రం పెద్దగా షేర్‌ చేసేందుకు ఆసక్తి చూపించరు. కాని తాజాగా అక్కినేని ప్రిన్స్‌ అఖిల్ ఫొటోను మాత్రం హీరోయిన్స్ ఫొటో షూట్‌ రేంజ్‌ లో షేర్‌ చేస్తున్నారు. అందమైన హీరోయిన్‌ ఫొటోలను ఎలా అయితే ఎక్కువ సమయం చూస్తున్నారో అఖిల్‌ ఈ ఫొటోను కూడా ఎక్కువ సమయం సోషల్ మీడియాలో చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

అఖిల్‌ ఈ పిక్ లో చాలా స్టైలిష్‌ గా బైక్ గా కూర్చుని అలా రొమాంటిక్ గా ఒక లుక్‌ ఇస్తున్నాడు. ఈ ఫొటోలు అక్కినేని అభిమానులను మాత్రమే కాకుండా అందరు హీరోల అభిమానులను ముఖ్యంగా అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా రొమాంటిక్ గా ఉన్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌ అఖిల్‌ ఈ స్టిల్ కు ఫిదా అవుతున్నారు అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో వారి షేరింగ్స్ మరియు కామెంట్స్‌ ఎక్కువగా ఉన్నాయి.

మొత్తంగా స్టైలిష్ హీరోయిన్‌ ల ఫొటోలను మాత్రమే కాకుండా ఇలా హీరోల ఫొటో షూట్ లకు కూడా మంచి స్పందన వస్తుందని అఖిల్ ఈ ఫొటో నిరూపించింది. బాలీవుడ్‌ కు చెందిన కొందరు హీరోలు అంటే అమ్మాయిలు పడి చస్తారు. ఇప్పుడు అఖిల్‌ అంటే కూడా అంతగా అభిమానంను వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆయన బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేయాలని కొందరు కోరుకుంటున్నారు.

ఇక అఖిల్‌ సినిమాల విషయానికి వస్తే మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఏ సమయంలో అయినా రిలీజ్ కు సిద్దం అవ్వొచ్చు. ఇక మరో వైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్టైలిష్‌ యాక్షన్‌ మూవీ ఏజెంట్‌ లో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. అఖిల్ ఫిజిక్‌ తో ఈ సినిమా లో హైలైట్ గా నిలువబోతున్నాడు. స్టైలిష్ టేకింగ్ కు పెట్టింది పేరు అయిన సురేందర్‌ రెడ్డి ఈ సినిమా లో అఖిల్‌ ను అమ్మాయిలకు మరింతగా దగ్గర చేస్తాడనే కామెంట్స్‌ కూడా వస్తున్నాయి. మొత్తానికి సినిమా మరో లెవల్‌ లో ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇవి మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయని అఖిల్ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. అఖిల్ మొదటి మూడు సినిమాలు నిరాశ పర్చడంతో తదుపరి సినిమా లపై కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే తదుపరి సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆలస్యం అయినా కూడా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ మొదలుకుని అన్ని కూడా అఖిల్‌ కు సక్సెస్ ను తెచ్చి పెట్టబోతున్నాయి అనే నమ్మకంతో అక్కినేని అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ మూవీ మనం లో చిన్న పాత్రలో కనిపించిన అఖిల్ త్వరలో నాగార్జున నటించబోతున్న ఒక సినిమా లో పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.