Begin typing your search above and press return to search.

స్పై ఏజెంట్ తో సూరి ర‌హ‌స్య‌ మంత‌నాలేమిటో..!

By:  Tupaki Desk   |   15 Aug 2021 9:00 AM IST
స్పై ఏజెంట్ తో సూరి ర‌హ‌స్య‌ మంత‌నాలేమిటో..!
X
అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఏజెంట్` పైనే అంద‌రి క‌ళ్లు. తొలి మ‌లి అనుభవాల నుంచి నేర్చుకుని అఖిల్ చాలా రాటు దేలాడు. ఈసారి సురేంద‌ర్ రెడ్డి మ‌లిచిన `ఏజెంట్` గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. స్పై పాత్ర‌లో అత‌డి గెట‌ప్ కి ఎలా ఉంటుందో ఇప్ప‌టికే రివీల్ చేసి స‌ర్ ప్రైజ్ చేశారు. అఖిల్ భీక‌రాకారం మైండ్ బ్లాక్ చేసింది. అత‌డు ఈ సినిమా కోసం చేస్తున్న హార్డ్ వ‌ర్క్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. జిమ్ లో క‌స‌ర‌త్తుల‌తో `వీ- షేప్` లుక్ ని తెచ్చాడు. కండ‌లు మెలితిరిగి న‌రాలు పొంగి క‌నిపిస్తున్నాయి. గుబురు గ‌డ్డం పొడ‌వాటి గిర‌జాల జుత్తుతో అఖిల్ హాలీవుడ్ స్టార్ నే త‌ల‌పిస్తున్నాడు.

ఇప్ప‌టికే అత‌డి లుక్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ క్రెడిట్ సూరి ఖాతాలోకే వెళుతుంది. ఇక ఏజెంట్ అన‌గానే ఈ సినిమా క‌చ్ఛితంగా బార్న్ ఫ్రాంఛైజీ త‌ర‌హాలో జేమ్స్ బాండ్ సిరీస్ త‌ర‌హాలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే విన్యాసాల‌తో అల‌రించ‌నున్నార‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది.

ప్ర‌స్తుతం ఏజెంట్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఇక అఖిల్ కి త‌న‌దైన సూచ‌న‌లు స‌ల‌హాలిస్తూ ఈ మూవీని సురేంద‌ర్ రెడ్డి గ్రిప్పింగ్ గా తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఆ ఇద్ద‌రూ ఓ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఏజెంట్ గురించిన చ‌ర్చ‌ను సాగిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఇలాంటి మూవ్ మెంట్స్ కోస‌మే జీవిస్తాను. డిస్క‌స్సింగ్ ఫైర్ ఇన్ పీస్... ఏజెంట్ లోడింగ్..! అంటూ అఖిల్ వ్యాఖ్య‌ను జోడించారు. ఇంత‌కీ ఫైర్ ఇన్ పీస్ అంటూ అఖిల్ ఏం చ‌ర్చిస్తున్నారో.. ఏజెంట్ పూర్తి యాక్ష‌న్ సినిమా .. ఛేజ్ లు యాక్ష‌న్ గ‌గుర్పొడిచే సాహ‌స విన్యాసాల‌తో ర‌క్తి క‌ట్ట‌నుంది. అందుకే అఖిల్ ఇలా ఫైర్ .. పీస్ అంటూ హింట్ ఇచ్చారు.. అఖిల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. హాలీవుడ్ బార్న్ ఐడెంటిటీ రేంజ్ విజువ‌ల్స్ ని అభిమానులు ఊహించ‌వ‌చ్చు.

అఖిల్ పైనే ఇండ‌స్ట్రీ క‌ళ్ల‌న్నీ!

అక్కినేని వార‌సుడు అఖిల్ స‌క్సెస్ కోసం ఎంత‌గా శ్ర‌మిస్తున్నాడో అత‌డి ప‌ట్టుద‌ల చెబుతోంది. త‌న‌ని తాను మార్చుకోవ‌డానికి నిరంత‌రం శ్ర‌మిస్తున్నాడు. ఫెయిల్యూర్స్ ని ప‌క్క‌న‌బెట్టి స‌క్సెస్ అనే ధ్యేయంతో ప‌నిచేస్తున్నాడు. పెర్పామెన్స్ లో ది బెస్ట్ అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. న‌టుడిగా షైన్ అవుతూ త‌న‌లోని త‌ప్పుల్ని తెలుసుకుని ముందుకు క‌దులుతున్నాడు.

అఖిల్ లుక్ కి గేమ్ ఆఫ్ థ్రోన్ లో కీల‌క పాత్ర ధారి అయిన జాన్ స్నోని పోలి ఉంద‌ని అంతా భావిస్తున్నారు. హెచ్ బీవో లో లైవ్ అవుతోన్న `గేమ్ ఆఫ్ థ్రోన్` సిరీస్ లో జాన్ స్నో పాత్ర‌కు... వేషాధార‌ణ‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. స‌రిగ్గా అదే లుక్ లో ఇప్పుడు అఖిల్ కనిపంచ‌డంతో అక్కినేని వార‌సుడ్ని ఆ సీనియ‌ర్ స్టార్ తో పోల్చేస్తున్నారు. ఏజెంట్ కి అన్ని వైపులా పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఏజెంట్ షూటింగ్ ద‌శ‌లో ఉంది. కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. అలాగే అఖిల్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. కానీ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలా? లేక థియేట‌ర్లో రిలీజ్ చేయాలా? అన్న దానిపై చ‌ర్చ సాగుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. దీనిపై మ‌రింత‌ స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.