Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్‌ మేకర్ చేతిలో పడ్డ మన కుర్ర హీరో

By:  Tupaki Desk   |   7 March 2022 8:00 PM IST
బాలీవుడ్ స్టార్‌ మేకర్ చేతిలో పడ్డ మన కుర్ర హీరో
X
బాలీవుడ్‌ లో ఎంతో మంది స్టార్ కిడ్స్ ను స్టార్స్ గా మల్చిన దర్శక నిర్మాత ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ఠక్కున వినిపించే పేరు కరణ్‌ జోహార్‌. ఈయన నిర్మాణ సంస్థ ఒక స్టార్‌ మేకింగ్‌ కర్మాగారంగా మారిపోయిందనే టాక్ కూడా ఉంది.

ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్‌ తమ వారసులను కరణ్‌ జోహార్ చేతిలో పెట్టాలని ఆశ పడుతూ ఉంటారు. ఒక్కో స్టార్‌ కిడ్‌ తో మూడు నాలుగు సినిమాలు తీసి మరీ వారిని స్టార్స్ గా మార్చడం ఈయనకు అలవాటు.

ఇప్పుడు ఈయన దృష్టి సౌత్‌ సినిమాలు ముఖ్యంగా మన తెలుగు సినిమాలపై పైడింది. బాహుబలి సినిమాను హిందీ ప్రేక్షకులకు అందించిన ఈయనకు భారీగా లాభాలు దక్కాయి. అప్పటి నుండి తెలుగు ఫిల్మ్ స్టార్స్ తో సినిమా లను ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలను చేయాలని కరణ్ జోహార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా నిర్మాణంలో కరణ్‌ జోహార్‌ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే.

మరో వైపు విజయ్ దేవరకొండతో ఒక డైరెక్ట్‌ హిందీ సినిమాను కూడా నిర్మించాలని కరణ్‌ జోహార్‌ ఆమద్య ప్రయత్నాలు చేశాడు. కాని ఇప్పటికే ఆయన చాలా సినిమాలను కమిట్‌ అయ్యి ఉండటం వల్ల తప్పనిపరిస్థితుల్లో నో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కినేని ప్రిన్స్ అఖిల్ తో కరణ్‌ జోహార్‌ సినిమా నిర్మాణం కు సంబంధించిన చర్చలు జరుపుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఒక బాలీవుడ్‌ దర్శకుడితో ఒక భారీ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడట. ఆ సినిమాలో అఖిల్‌ అక్కినేని హీరోగా నటించడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అఖిల్‌ ప్రస్తుతం ఏజెంట్‌ సినిమా లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆ వెంటనే ఈయన తదుపరి సినిమా ను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు.

అఖిల్‌ తో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ప్రిన్స్ ఇప్పటి వరకు సాలిడ్‌ సక్సెస్ ను ఇప్పటి వరకు కూడా అందుకోవడం లో విఫలం అయ్యాడు. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సక్సెస్ అయినా కూడా అభిమానులకు అది సరిపోలేదు. ఓ రేంజ్ సక్సెస్‌.. వంద కోట్ల సినిమాలను అఖిల్‌ నుండి అభినులు ఆశిస్తున్నారు.

మరి అఖిల్ తో కరణ్‌ జోహార్‌ సినిమా తీసి అభిమానుల కోరిక ను తీర్చేనా చూడాలి. అఖిల్‌.. కరణ్‌ జోహార్‌ ల మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అన్ని విషయాలపై క్లారిటీ రానుంది.