Begin typing your search above and press return to search.

టెర్రరిజం.. ఇబోలా.. పక్కనే అఖిల్‌

By:  Tupaki Desk   |   12 April 2015 5:00 PM IST
టెర్రరిజం.. ఇబోలా.. పక్కనే అఖిల్‌
X
ఈ మధ్యకాలంలో ఇబోలా అనే వ్యాధి క్రియేట్‌ చేసిన ఫియర్‌ అంతా ఇంతా కాదు. అయితే ఈ భయమంతా ప్రజలు మర్చిపోక ముందే, ఇప్పుడు ఆఫ్రికన్‌ దేశాల్లో వివిధ ఇస్లామిక్‌ తీవ్రవాదులు ప్రజలపై విరుచుకుపడుతున్నారు. అల్‌ షబాబ్‌ అనే తీవ్రవాద సంస్థ ఈ దేశంలో కూడా భయానకం సృష్టిస్తోంది. ఇలాంటి సమస్యలతో ప్రస్తుతం అల్లకల్లోలంగా తయారైన ఓ దేశం యుగాండా. కట్‌ చేస్తే అక్కడికే షూటింగ్‌ కోసం వెళుతున్నాడు హీరో అఖిల్‌.

తన తొలిసినిమాతో విపరీతంగా సత్తా చాటేయాలని చూస్తున్న అఖిల్‌ వివి వినాయక్‌ దర్శకత్వంలో ఇప్పుడు రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ సినిమా యునిట్‌ స్పెయిన్‌లో ఓ షెడ్యూల్‌ ముగించుకొని, యుగండా వెళతారట. మరి సదరు ఆఫ్రికన్‌ దేశంపై ఉన్న భయం దృష్ట్యా అఖిల్‌ అక్కడకు వెళుతున్నాడంటే ఫ్యాన్స్‌కు భయమేస్తోంది. నిజానికి వీరు అన్నీ సేఫ్‌గానే ప్లాన్‌ చేసుకొని ఉంటారు. కాని అలాంటి రిస్కీ ఆఫ్రికన్‌ కంట్రీలో షూట్‌ చేయకపోతే ఇప్పుడు వచ్చే నష్టమేముంటుంది? ఖచ్చితంగా ఏమీ ఉండదు. కాని అఖిల్‌ సినిమాను మాత్రం అక్కడే తీస్తారట. అది సంగతి.