Begin typing your search above and press return to search.

బాడీ చూపించి డేట్ కూడా చెప్తే బాగుండేది అఖిల్‌

By:  Tupaki Desk   |   2 Jan 2022 11:24 AM IST
బాడీ చూపించి డేట్ కూడా చెప్తే బాగుండేది అఖిల్‌
X
అఖిల్‌ అక్కినేని హీరోగా ప్రస్తుతం ఏజెంట్‌ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి తర్వాత రూపొందుతున్న సినిమా ఇదే కావడం విశేషం. సైరా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న సూరి ఒక స్టైలిష్‌ పాష్‌ పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ తో అఖిల్ ను ఒప్పించి ఏజెంట్‌ చేస్తున్న విషయం తెల్సిందే. స్టైలిష్ టేకింగ్‌ తో పాటు అఖిల్‌ ను సరికొత్తగా చూపించేందుకు గాను సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అఖిల్ లుక్ కోసం దాదాపుగా ఆరు నెలల పాటు వెయిట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అఖిల్‌ కండల వీరుడిగా మారి ఏజెంట్‌ లో నటిస్తున్నాడు. ఇప్పటికే అఖిల్ ఫిజిక్‌ కు సంబంధించిన ఫొటోలు చాలానే వచ్చాయి.

తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా కూడా అఖిల్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీనే చూపించారు. ఏజెంట్‌ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లేదా విడుదల తేదీని ప్రకటించి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ లేడీ ఫ్యాన్స్ కు ఈ ఫొటో లు ఖచ్చితంగా కిక్‌ ఇస్తాయి. కాని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి ఉంటే అందరికి కూడా మరింత ఆనందం కలిగేది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అఖిల్‌ నుండి బ్యాక్ టు బ్యాక్ ఫిజిక్ వీడియో లు.. సిక్స్ ఫ్యాక్‌ ఫొటోలు వస్తున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇదే సమయంలో సినిమా కు సంబంధించిన విడుదల తేదీ పై ఆసక్తి పెరుగుతోంది.

అఖిల్‌ హీరోగా గత ఏడాది వచ్చిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుని మొదటి కమర్షియల్‌ సక్సెస్ ను అఖిల్ కు తెచ్చి పెట్టింది. అందుకే ఆ సినిమా తర్వాత రాబోతున్న సినిమా అవ్వడం వల్ల ఏజెంట్‌ పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఏజెంట్‌ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మొన్నటి వరకు అనుకున్నారు. కాని ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రెండు మూడు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. కనుక విడుదల తేదీ విషయంలో ఏజెంట్‌ మేకర్స్ ఒక క్లారిటీ ఇవ్వలేక పోతున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఏజెంట్‌ షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.