Begin typing your search above and press return to search.

అన్నయ్యపై లవ్ రూమర్స్.. అఖిల్ కౌంటర్!

By:  Tupaki Desk   |   16 April 2023 7:17 PM IST
అన్నయ్యపై లవ్ రూమర్స్.. అఖిల్ కౌంటర్!
X
అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూలిపాళ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వీటిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో చాలా మంది నిజమని భావిస్తున్నారు. గతంలో వచ్చిన ఫొటోలు కాకుండా.. ఇటీవల కూడా వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి రిలేషన్ గురించి అక్కినేని అఖిల్ కు ప్రశ్న ఎదురైంది. అయితే ఆ తరువాత అందులో ఎలాంటి నిజం లేదని అర్ధమయ్యింది.

ఇక అఖిల్ అక్కినేని తాజాగా నటించిన చిత్రం ఏజెంట్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ప్రతినిధి.. అఖిల్ ను తన అన్నయ్య గురించి ఓ ప్రశ్న అడిగాడు. మీ అన్నయ్య నాగ చైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు, ఎవరో అమ్మాయితో కనిపించి మరి మీ పరిస్థితి ఏంటని అడిగారు. అన్నయ్య ఏమో కానీ నా పరిస్థితి మాత్రం ఏజెంట్ సినిమా అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

రెండేళ్లుగా పిలక, బాడీ మెయింటెయిన్ చేయడానికి సరిపోతుందంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి రాగూల్ హెరియన్ థారుమాన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా... నవీన్ నూలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ SonyLIV చిత్రం యొక్క పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను డీసెంట్ ధరకు కొనుగోలు చేసిందట. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతకాలానికి ఈ చిత్రం సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది, ఎంత మేర కలెక్షన్లను సాధిస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.