Begin typing your search above and press return to search.

అఖిల్ ఏజెంట్ సెన్సార్.. అనుకున్నట్టుగానే..!

By:  Tupaki Desk   |   22 April 2023 3:06 AM IST
అఖిల్ ఏజెంట్ సెన్సార్.. అనుకున్నట్టుగానే..!
X
అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ మూవీ నిర్మించారు. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్ యాక్షన్ సీన్స్ తో రాబోతుంది. సినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడు అన్నది ట్రైలర్ లో అర్ధమవుతుంది. ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అఖిల్ ఏజెంట్ సినిమాకు సెన్సార్ టీం U/A సర్టిఫికెట్ ఇచ్చారు.

అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించారు. సెన్సార్ టీం నుంచి సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తుంది. అఖిల్ ఏజెంట్ సినిమా 2:36 గంటల రన్ టైం తో వస్తుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమాలో అఖిల్ యాక్షన్ సీన్స్ సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం ఎంతో ఫోకస్ గా పనిచేశారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ అంతా ట్రైలర్ లో కనిపించింది.

స్పై మూవీ గా రాబోతున్న అఖిల్ ఏజెంట్ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. అఖిల్, మమ్ముట్టి కాంబో సీన్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. మొదటి సినిమా అఖిల్ నుంచి హలో, మిస్టర్ మజ్ను దాకా సక్సెస్ కోసం ఎదురుచూసిన అఖిల్ ఫైనల్ గా రెండేళ్ల క్రితం వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ అందుకున్నాడు. అయితే మిగతా అక్కినేని హీరోల్లా క్లాస్ హీరోలా కాకుండా అఖిల్ మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

ఏజెంట్ సినిమా అఖిల్ కు మాస్ ఇమేజ్ వస్తుందా.. అఖిల్ మాస్ హీరోగా ఆడియన్స్ లో తన మార్క్ చూపిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏజెంట్ సినిమా రిలీజ్ అవుతున్న డేట్ కూడా సూపర్ హిట్ సెంటిమెంట్. ఆ రోజున రిలీజైన చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు కొట్టాయి మరి ఏజెంట్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.