Begin typing your search above and press return to search.

సెట్స్ లోకి అడుగుపెట్టనున్న అఖిల్ 4

By:  Tupaki Desk   |   18 Jun 2019 10:04 AM GMT
సెట్స్ లోకి అడుగుపెట్టనున్న అఖిల్ 4
X
అక్కినేని నాగార్జున రెండో వారసుడిగా అఖిల్ తో పరిచయమైన అఖిల్ దాని తర్వాత చేసిన హలో-మిస్టర్ మజ్ను రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. పరిశ్రమకు వచ్చి నాలుగో ఏడాదిలో అడుగు పెట్టిన అఖిల్ కు ఇప్పుడు సాలిడ్ బ్లాక్ బస్టర్ కావాలి. అనూహ్యంగా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ కి ఓకే చెప్పిన అఖిల్ దీన్ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మాణంలో చేస్తుండటం విశేషం.

ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ వచ్చే 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లనుంది. హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో భాస్కర్ బిజీగా ఉన్నాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న అఖిల్ 4కి టైటిల్ ఇంకా డిసైడ్ కాలేదు. బహుశా ఈ ఏడాది విడుదల ఉంటుందో లేదో అనుమానంగానే ఉంది. మిస్టర్ మజ్ను రిజల్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడీ సబ్జెక్టు మీద బాగానే వర్క్ అవుట్ చేసినట్టు సమాచారం.

సున్నితమైన ఎమోషన్స్ తో ఫామిలీ లవ్ స్టోరీస్ ని బాగా తీస్తాడని పేరున్న భాస్కర్ అఖిల్ ని ఏ జానర్ లో చూపించబోతున్నాడో ఇంకా తెలియలేదు. ఇన్ సైడ్ టాక్ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు. మ్యూజికల్ గా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గోపి సుందర్ తో ట్యూన్స్ చేయించుకుంటున్నారట. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తమ హీరో మొదటి హిట్టు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు