Begin typing your search above and press return to search.

మూడో సినిమా కోసం వేట మొదలు..

By:  Tupaki Desk   |   27 March 2018 1:14 PM GMT
మూడో సినిమా కోసం వేట మొదలు..
X
అక్కినేని అఖిల్.. టాలీవుడ్లో అందరికి ప్రియమైన అక్కినేని కుటుంబ వారసుడు.. అందం ఉంది.. టాలెంట్ ఉంది.. బాక్గ్రౌండ్ ఉంది. అయినా సరే అనుకున్న రేంజ్ విజయం ఇంకా సొంతం చేసుకోలేకపోయాడు ఈ కుర్ర హీరో. మొదటి సినిమా 'అఖిల్' కథలో లోపమో - దర్శకత్వంలోనో మరేదైనా కావచ్చు సినిమా డిసాస్టర్ అయింది. రెండో సినిమాకు బాగా జాగ్రత్తలు వహించారు. కానీ అది కూడా విజయం చేకూర్చలేకపోయింది. మొదటి సినిమా కంటే నటనలోను - డాన్స్ లోను చాలా ఇంప్రూవ్మెంట్ చూపించాడు అఖిల్. ఎంత చేసినా పాజిటివ్ టాక్ సంపాదించింది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. మొత్తానికి మొదటి రెండు సినిమాలను ప్లాప్స్ గానే నమోదు చేసుకున్నాడు మన సిసింద్రీ. అందుకే మొదటి రెండింటిలో చేసిన తప్పులను మూడవ సినిమాలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని తీర్మానించుకున్నాడు.

ఇలా చూడగా - మొదటి రెండు సినిమా లలోనూ కొత్త హీరోయిన్లతోనే చేశాడు అఖిల్. డెబ్యూ సినిమాలో సయ్యేషా సైగల్, రెండవ సినిమాలో కల్యాణి తెలుగు తెరకు పరిచాయమయ్యారు. అందుకే మూడో సినిమాలో కొత్త అమ్మాయిని కాకుండా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన మొహం అయితే మంచిది అని భావిస్తున్నారట. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అఖిల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాలో పేరున్న హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు. షూటింగ్ మే లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాబట్టి ఈలోపు అసలు అఖిల్ సరసన సరిపోయే యంగ్ హీరోయిన్ ను చూసి సెట్ చేసేద్దాం అనుకుంటున్నారట. మరి ఇప్పుడున్నవారిలో అలా అఖిల్ పక్కన ఒదిగిపోయే భామ ఎవరున్నారు? ఆ విషయం చెప్పడం కష్టమే. కాకపోతే అనుపమా పరమేశ్వరన్.. అను ఎమ్మానుయేల్.. అలాగే ఇంకొందరు యంగ్ బ్యూటీలు బాగానే ఉంటారు. చూద్దాం ఎవరిని సెట్ చేస్తారో.