Begin typing your search above and press return to search.

రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బాలయ్య టీజర్..!

By:  Tupaki Desk   |   25 April 2021 2:30 AM GMT
రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బాలయ్య టీజర్..!
X
టాలీవుడ్ నటసింహం బాలయ్య సినిమాలంటేనే నందమూరి అభిమానులలో ఎక్కడలేని సందడి కనిపిస్తుంది. కేవలం పోస్టర్ వస్తేనే చాలు అనుకుంటున్న సమయంలో ఏకంగా విందు భోజనం పెట్టినట్లుగా టైటిల్, టీజర్ వచ్చేసరికి ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. అసలే బాలయ్య - డైరెక్టర్ బోయపాటి శీను సినిమాలకు ఉండే ఆ క్రేజ్ వేరు. ఇదివరకే ఇద్దరూ కలిసి సింహా, లెజెండ్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేశారు. బోయపాటి అంటేనే ఊరమాస్ సినిమాలు.. ఊరమాస్ అంటేనే బోయపాటి అన్నట్లుగా బాలయ్యతో రూపొందిస్తాడు. అసలే రోర్ వీడియోతోనే అంచనాలు పెంచేసిన ఈ కాంబినేషన్.. ఇటీవల ఉగాది సందర్బంగా అఖండ అనే టైటిల్ తో పాటు టీజర్ విడుదల చేసి అభిమానులకు భారీ ట్రీట్ ఇచ్చారు.

ప్రస్తుతం బాలయ్య అఖండ టీజర్ యూట్యూబ్ లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్ సొంతం చేసుకుంటుంది. కేవలం విడుదలైన పదకొండు రోజుల్లోనే అఖండ టీజర్ సీనియర్ స్టార్ హీరోల టీజర్ల రికార్డులను క్రాస్ చేసేసింది. సౌత్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ నటించిన కబాలి సినిమా టీజర్ ఇప్పటివరకు 38మిలియన్స్ తో టాప్ లో ఉంది. ఇప్పుడు బాలయ్య అఖండ టీజర్ 39 మిలియన్స్ దాటి 40వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే నందమూరి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా అఖండ టీజర్ వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ పోషిస్తుండగా.. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే 28న అఖండ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ముందుముందు ఏదైనా మార్పు జరుగుతుందేమో చూడాలి.