Begin typing your search above and press return to search.

రజినీకాంత్ రికార్డును బ్రేక్ చేసే దిశగా బాలయ్య..!

By:  Tupaki Desk   |   23 April 2021 12:30 PM GMT
రజినీకాంత్ రికార్డును బ్రేక్ చేసే దిశగా బాలయ్య..!
X
‘సింహా’ ‘లెజెండ్‌’ వంటి సూపర్ హిట్స్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 13న టైటిల్‌ రోర్ పేరుతో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్ ని విడుదల చేయగా.. యూట్యూబ్‌ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని సరికొత్త గెటప్ లో బాల‌య్య క‌నిపించడం.. బోయపాటి మార్క్ యాక్షన్.. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోవడంతో ఈ టీజర్‌ కు ఊహించని రీతిలో స్పందన లభించింది. ఇప్పటికే 35 మిలియన్లకు పైగా వ్యూస్.. 390K+ లైక్స్‌ రాబట్టి టాలీవుడ్ సీనియర్ హీరోల రికార్డులను బ్రేక్ చేసింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా టీజర్ రికార్డును బద్దలు కొట్టే దిశగా బాలయ్య 'అఖండ' టీజర్ దూసుకుపోతోంది.

రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన 'కబాలి' సినిమా టీజర్ ఇప్పటి వరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. దక్షిణాది సీనియర్ స్టార్ హీరోల మూవీ టీజర్స్ లో ఇదే అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్ గా నమోదైంది. అయితే ఇప్పుడు బాలకృష్ణ 'అఖండ' మూవీ విడుదలైన వారంలోనే 35M+ వ్యూస్ తో దూసుకుపోతోంది. బాలయ్య స్పీడ్ చూస్తుంటే రజినీ 'కబాలి' టీజర్ ఆల్ టైం వ్యూస్ ని కొద్ది రోజుల్లోనే 'అఖండ' బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఇకపోతే బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌ లో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ - పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న 'అఖండ' చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.