Begin typing your search above and press return to search.

'అఖండ అన్ స్టాపబుల్'.. బాలయ్య నుంచి రెండు దీపావళి కానుకలు..

By:  Tupaki Desk   |   2 Nov 2021 3:30 PM GMT
అఖండ అన్ స్టాపబుల్.. బాలయ్య నుంచి రెండు దీపావళి కానుకలు..
X
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన నటసింహం నందమూరి బాలకృష్ణ.. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక చిత్రాన్ని లైన్ లో పెడుతూ దూకుడు చూపిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్ మీద అలరించిన బాలయ్య.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో సందడి చేయడానికి రెడీ అయ్యారు.

తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే టాక్ షో హోస్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇది నటసింహానికి డిజిటల్ డెబ్యూ. ఇందులో భాగంగా పలువురు సినీ ప్రముఖులను బాలయ్య ఇంటర్వ్యూ చేయనున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీకి చెందిన మోహన్ బాబు - విష్ణు - లక్ష్మీ హాజరు కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా.. అనూహ్య స్పందన తెచ్చుకుని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న తొలి ఎపిసోడ్ ప్రీమియర్ ప్రసారం కానుంది.

ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శశ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ' సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ కూడా రెడీ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ ప్రోమోను ఈ నెల 4వ తేదీన ఉదయం 11.43 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పూర్తి పాట లిరికల్ వీడియో నవంబర్ 8న వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇలా దీపావళి సందర్భంగా బాలయ్య ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో ఫస్ట్ ఎపిసోడ్ మరియు 'అఖండ' టైటిల్ సాంగ్ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ రెండు కానుకల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

'అఖండ' సినిమా విషయానికొస్తే.. ఇది 'సింహా' లెజెండ్' తర్వాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు గెటప్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనువిందు చేస్తుండగా.. జగపతిబాబు - శ్రీకాంత్ - పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ద్వారాక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.