Begin typing your search above and press return to search.

2021లో బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా 'అఖండ'..!

By:  Tupaki Desk   |   29 Dec 2021 4:30 AM GMT
2021లో బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా అఖండ..!
X
నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ''అఖండ''. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలకు ధైర్యాన్నిచ్చిన చిత్రంగా నిలిచింది.

‘సింహా’ ‘లెజెండ్’ వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టడమే లక్ష్యంగా బరిలో దిగిన బాలయ్య - బోయపాటి.. 'అఖండ'మైన విజయాన్ని అందుకున్నారు. తమది తిరుగులేని కాంబినేషన్ అని చాటి చెప్పారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించారు.

తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా ఓవర్ సీస్ లోనూ 'అఖండ' మాస్ జాతర కొనసాగింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌ లో చేరడం విశేషం. అలానే యూఎస్ఏలో మిలియన్ డాలర్లకిపైగా కలెక్ట్ చేసి, ఖండ ఖండాల వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.

25 రోజులకుపైగా దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న ''అఖండ'' చిత్రం.. ఇప్పటి వరకు రూ. 125 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో తెలుగులో అతి పెద్ద లాభదాయకమైన చిత్రంగా 'అఖండ' రికార్డ్ క్రియేట్ చేసిందని తెలుస్తోంది.

కరోనా పాండమిక్వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ 'అఖండ' ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం గొప్ప విషయమెనే చెప్పాలి. ఇది బాలకృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా.. అత్యధిక ఓవర్ సీస్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అలానే దర్శకుడు బోయపాటి శ్రీను కెరీర్ లో యూఎస్ మార్కెట్ లో మిలియ‌న్ మార్క్ అందుకున్నట్లు చిత్రంగా నిలిచినట్లు తెలుస్తోంది.

కాగా, 'అఖండ' చిత్రంలో అఘోరాగా, మురళీకృష్ణగా రెండు పాత్రల్లో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పవచ్చు. పాటల కంటే కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ తో థమన్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు.

ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ - జగపతి బాబు - పూర్ణ - నితిన్ మెహతా - కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కోవిడ్ పరిస్థితుల్లో కాస్త ఆలస్యమైనా కూడా థియేట్రికల్ రిలీజ్ చేసిన నిర్మాత.. అఖండమైన విజయంతో లాభాలు ఆర్జించారు. సరైన కథ కుదిరితే 'అఖండ' కు సీక్వెల్‌ తీయడానికి రెడీ అని చెబుతున్న మేకర్స్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.