Begin typing your search above and press return to search.

వీక్ డేస్ లో కూడా అఖండ స్ట్రాంగే

By:  Tupaki Desk   |   7 Dec 2021 5:31 AM GMT
వీక్ డేస్ లో కూడా అఖండ స్ట్రాంగే
X
బాలకృష్ణ.. బోయపాటిల హ్యాట్రిక్ మూవీ అఖండ వసూళ్ల గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. గురు వారం విడుదల అయిన అఖండ సినిమా ఆదివారం వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఆదివారం తర్వాత అఖండ జోరు తగ్గుతుందని అంతా భావించారు. కాని అఖండ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. బాలయ్య బి మరియు సి సెంటర్ ల్లో అఖండమైన వసూళ్లను సోమవారం కూడా రాబట్టాడు. గత రెండేళ్ల కాలంలో వీక్ డేస్ ల్లో ఏ ఒక్క సినిమాకు రాని వసూళ్లు ఈ సినిమాకు నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. అత్యధిక వసూళ్లు అన్ని ఏరియాల్లో కూడా ఆదివారం వరకు నమోదు అయ్యాయి. సోమవారం కూడా నైజాంతో పాటు ఏపీలో పలు సెంటర్ల వద్ద కూడా భారీ ఎత్తున జనాలు బారులు తీరారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇప్పటికే పలు ఏరియాల్లో అఖండ బ్రేక్ ఈవెన్‌ సాధించిందనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు.. కాని అన్ని ఏరియాల్లో కూడా అకండ వసూళ్లు నమోదు అవుతున్నాయని మాత్రం చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఒక మాస్ మసాలా సినిమా పడటంతో బి మరియు సి సెంటర్ ప్రేక్షకులు సినిమాను వదలడం లేదు. ఈమద్య కాలంలో అన్ని క్లాస్ మూవీస్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అఖండ సినిమాకు ఆధరణ ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఒక్క బాలయ్య అభిమానితో పాటు తెలుగు ప్రేక్షకులు అఖండ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా వస్తున్న వసూళ్లను చూసి ఇతర సినిమాల మేకర్స్ కూడా తమ సినిమాల ఫలితాలు ఖచ్చితంగా పాజిటివ్‌ గా వస్తాయనే నమ్మకంకు వచ్చారు.

అఖండ ముందు వరకు సినిమా లు ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం నీరసంగానే ఉంటాయని మొదటి రెండు మూడు రోజులు తప్ప వీక్‌ డేస్ లో మాత్రం ఖచ్చితంగా నిరాశ తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని వారి అభిప్రాయం తప్పు అయ్యింది. వీక్ డేస్‌ లో కూడా అఖండ మంచి వసూళ్లు దక్కించుకుంటుంది. ఇదే జోరు శుక్రవారం వరకు కొనసాగితే మళ్లీ శని ఆదివారాల్లో అఖండ భారీ వసూళ్లు నమోదు చేసి బాలయ్య కెరీర్ లోనే టాప్ వసూళ్లు సాధించిన సినిమా గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. వీక్‌ డేస్ లో అఖండ స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో కేవలం ఇది సాదారణ విజయం కాదంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ద్వి పాత్రాభినయం చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రాబోయే శుక్రవారం కూడా పెద్ద సినిమా లో అఖండ కు పోటీ ఇచ్చి ఢీ కొట్టే సినిమా లు లేవు కనుక అఖండ రెండవ వారంలో కూడా స్ట్రాంగ్‌ గా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.