Begin typing your search above and press return to search.

పిక్ టాక్: కుర్ర బ్యూటీతో బాలయ్య ఊర మాస్ స్టెప్పులు..!

By:  Tupaki Desk   |   23 Nov 2021 2:36 PM GMT
పిక్ టాక్: కుర్ర బ్యూటీతో బాలయ్య ఊర మాస్ స్టెప్పులు..!
X
నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన అప్డేట్ తో ముందుకు వచ్చారు.

''అఖండ'' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27న గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆ రోజు సాయంత్రం ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఈ వేడుకకు మొత్తం చిత్ర బృందంతో పాటుగా ఈవెంట్ ను మరింత ప్రత్యేకంగా చేయడానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

సినిమాలోని సాంగ్ కు సంబంధించిన ఈ పోస్టర్ లో బాలకృష్ణ తో పాటుగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సందడి చేస్తున్నారు. గోల్డ్ కలర్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఇద్దరూ మాస్ స్టెప్స్ వేస్తూ కనిపిస్తున్నారు. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తుంటే.. నవ్వులు చిందిస్తున్న ప్రగ్యా బ్యూటీఫుల్ గా ఉంది. వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. నిజానికి సీనియర్ హీరో బాలకృష్ణ కు కుర్ర భామ ప్రగ్యాకు మధ్య వయసు రీత్యా చాలా గ్యాప్ ఉంది. మరి వీరి జోడీ వెండితెర మీద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా, 'అఖండ' సినిమాలో అఘోరా గా ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాత్రలకు సంబంధించిన టీజర్స్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే థమన్ స్వరపరిచిన రెండు పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది.

'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్స్ తర్వాత బోయపాటి - బాలకృష్ణ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు - శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.