Begin typing your search above and press return to search.

'అఖండ' తెలుగు రాష్ట్రాల్లో ధ‌మాకా!

By:  Tupaki Desk   |   3 Dec 2021 7:30 AM GMT
అఖండ తెలుగు రాష్ట్రాల్లో ధ‌మాకా!
X
`అఖండ` ఢ‌మ‌రుకం మోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బాల‌య్య మాస్ ఫ్యాన్స్ వీరంగం క‌నిపిస్తోంది. థియేట‌ర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇప్ప‌టికే డే వ‌న్ లో రికార్డ్ వ‌సూళ్ల‌ను అందుకుంది అఖండ‌. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి స్థాయి డే-వ‌న్ అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. నిజానికి ఏపీలో టిక్కెట్టు గిట్టుబాటు లేక‌పోవ‌డంతో క‌లెక్ష‌న్ల జోరు క‌నిపించ‌లేదు కానీ.. అది రెట్టింపు అయ్యేదేన‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ఇక‌పోతే డే-వ‌న్ అంటే డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ వీరంగం హాట్ టాపిక్ గా మారింది. మొద‌టిరోజు ఈ మూవీకి 23 కోట్ల గ్రాస్ 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్స్ వివరాలు ప‌రిశీలిస్తే.. నైజాం- 4.39 కోట్లు .. సీడెడ్- 4.02 కోట్లు.. ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు.. ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు..వెస్ట్ గోదావరి- 96 లక్షలు.. గుంటూరు- 1.87 కోట్లు
కృష్ణా- 81 లక్షలు..నెల్లూరు- 93 లక్షలు.. వసూలైంది.

అఖండ 54 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేయ‌గా.. 55 కోట్లు షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించిన‌ట్టు. మిశ్ర‌మ స్పంద‌న‌ల‌తో మొద‌లైన ఈ చిత్రానికి మాస్ లో ఆద‌ర‌ణ బావుంది. దీంతో సునాయాసంగా తొలి వారంలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంద‌ని భావిస్తున్నారు. ఒమిక్రాన్ దేశంలో ప్ర‌వేశించింది. హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో హైఅలెర్ట్ ఉంది. దీనివ‌ల్ల క‌లెక్ష‌న్లు త‌గ్గితే ఇబ్బందే. అలా కాకుండా అఖండ బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భావిస్తున్నారు.