Begin typing your search above and press return to search.

ఏపీలో అంగరంగ వైభవంగా 'అఖండ' వేడుక

By:  Tupaki Desk   |   17 Nov 2021 5:35 AM GMT
ఏపీలో అంగరంగ వైభవంగా అఖండ వేడుక
X
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన అఖండ సినిమాను డిసెంబర్‌ 2న విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీకి మరో రెండు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో బోయపాటి అండ్ టీమ్‌ ప్రమోషనల్‌ కార్యక్రమాలకు సిద్దం అయ్యారు. భారీ ఎత్తున అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఇప్పటికే శ్రేయాస్ మీడియా వారితో ఒప్పందం చేసుకున్నారట. ఈమద్య కాలంలో శ్రేయాస్ మీడియా భారీ ఈవెంట్స్ ను అత్యంత విభిన్నంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అందుకే అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా శ్రేయాస్ మీడియా ఖచ్చితంగా వైభవంగా నిర్వహిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అఖండ ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్‌ లో నిర్వహించబోతున్నారట. అందుకోసం ఇప్పటికే అక్కడ ఒక ప్లేస్ ను ఎంపిక చేశారని.. త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ప్రీ రిలీజ్ వేడుక వేదికకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన రావడంతో పాటు అక్కడ ఏర్పాట్లు కూడా మొదలు అవ్వబోతున్నాయి. మళ్లీ హైదరాబాద్ లో కూడా ప్రమోషనల్‌ ఈవెంట్స్ ను నిర్వహించాల్సి ఉంది. కనుక విడుదలకు పది రోజుల ముందుగానే అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఏపీలో నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగనుందట. భారీ ఎత్తున తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు హాజరు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. బాలయ్య తో పాటు ఇంకా పలువురు తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ఇప్పటికే సింహా మరియు లెంజెండ్‌ సినిమా లు చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి కాంబోలో రూపొందిన అఖండ సినిమా హ్యాట్రిక్ ను దక్కించుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. రికార్డు లు బద్దలు కొట్టేలా అఖండ సినిమా వసూళ్లు ఉంటాయనే నమ్మకంతో నందమూరి అభిమానులు ఉన్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను అఖండ దక్కించుకోబోతున్నట్లుగా నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్‌ మెయిన్‌ విలన్ గా కనిపించబోతున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా అఖండ అఘోర లుక్ లో బాలయ్య అల్లాడిస్తున్నాడు. సినిమా పై అంచనాలు భారీగా పెంచేసిన అఖండ ట్రైలర్‌ భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది.