Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : అఖండ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   5 July 2021 5:30 AM GMT
ఫొటోటాక్ : అఖండ అందాల ఆరబోత
X
తెలుగు ప్రేక్షకులకు కంచె సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ తెలుగు లో ఆశించిన స్థాయిలో ఆఫర్లను దక్కించుకోలేక పోయింది. అందంతో పాటు మంచి పొడవు మరియు ఫిజిక్ ను కూడా కలిగి ఉన్న ఈ అమ్మడు నటిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. కాని ఆవగింజంత అదృష్టం ఆమెకు కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా నిలవడంలో విఫలం అయ్యింది. కాని అప్పుడప్పుడు ఆఫర్లు మాత్రం దక్కించుకుంటూనే ఉంది. తెలుగు లో ఈ అమ్మడు చిన్నా పెద్ద సినిమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంది.

బాలకృష్ణ అఖండ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బిజీ అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి హాట్‌ ఫొటో షూట్‌ లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటో మరింత హాట్ గా అందరిని కట్టిపడేసేలా ఉంది. బెడ్‌ పై అలా బికినీలో పడుకుని ఉన్న ఈ ఫొటో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

ప్రగ్యా అందంతో పాటు ఆమె ఫిజిక్‌ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫొటోతో ఆమె ఫిజిక్ కు మరింత మంది ఫ్యాన్స్ అవుతారు అనడంలో సందేహం లేదు. తెల్లని బ్లాంకెట్‌ వేసిన బెడ్‌ పై అలా అందమైన స్కిన్ టోన్‌ తో క్రీమ్‌ కలర్‌ బికినీ ధరించిన ప్రగ్యా జైస్వాల్‌ పడుకుని ఉంటే ఆమెను కొద్ది సమయం అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.