Begin typing your search above and press return to search.

శిష్యుడి చేతిలో వారసుడు - పూరి స్ట్రాటజీ

By:  Tupaki Desk   |   7 Feb 2019 10:00 AM GMT
శిష్యుడి చేతిలో వారసుడు - పూరి స్ట్రాటజీ
X
టిపికల్ హీరోయిజంతో మాస్ కి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రామ్ తో చేస్తున్న ఐస్మార్ట్ శంకర్ మీదే పెట్టాడు. మేలో రిలీజ్ అని టార్గెట్ పెట్టేసుకున్నారు కాబట్టి ఎక్కడా గ్యాప్ ఇవ్వడానికి ఉండదు. గత కొంతకాలంగా తన రేంజ్ సక్సెస్ కు దూరంగా ఉన్న పూరి దీంతో సాలిడ్ హిట్ కొట్టి ఎలాగైనా తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఉన్నాడు. నిధి అగర్వాల్-నభ నటేష్ లను హీరొయిన్లుగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

దీంతో పాటు గత ఏడాది కొడుకుని మెహబూబా ద్వారా పరిచయం చేసిన పూరి ఆకాష్ రెండో సినిమా మాత్రం తన శిష్యుడికి అప్పగించబోతున్నాడు. అనిల్ పడూరి పూరి దగ్గర దర్శకత్వ శాఖలో ఎప్పటి నుంచో పనిచేస్తూ డైరెక్టర్ డెబ్యు కోసం ఎదురు చూస్తున్నాడు. అతని పనితనం బాగా తెలిసిన పూరి ఆకాష్ పూరి రెండో సినిమా బాధ్యతలు అతనికే అప్పగించినట్టు తెలిసింది. ఆకాష్ పూరి మెహబూబా నిరాశ పరిచినా కుర్రాడిలో విషయముందని అర్థమైపోయింది. సరైన కథ పడితే ఆకట్టుకునే టాలెంట్ తో సినిమాను నిలబెట్టగలడు అనే నమ్మకమైతే కలిగించాడు.

అయితే మెహబూబా మరీ బరువైన ఇండో పాక్ లవ్ స్టొరీ కావడంతో పూరి డీలింగ్ ఎక్కడో తేడా కొట్టి వసూళ్లు తిరగబడ్డాయి. అందుకే అనిల్ పడూరిని నమ్మి ఆకాష్ ని అప్పగించాడట. అయితే పర్యవేక్షణ మాత్రం పూరినే చేస్తాడని తెలిసింది. హీరొయిన్ టెక్నికల్ టీం ని సెట్ చేసుకునే పనిని ఇప్పటికే అనిల్ మొదలుపెట్టడని వినికిడి. మరో నెల లేదా రెండు నెలల్లో ఇది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన కొడుక్కి హిట్ ఇచ్చి గురువు ఋణం తీర్చుకునే ఛాన్స్ ని అనిల్ పడూరి ఎలా వాడుకుంటాడో చూడాలి