Begin typing your search above and press return to search.

యంగ్ హీరో కోసం మిస్ ఢిల్లీ ఫిక్స్

By:  Tupaki Desk   |   29 Nov 2018 8:14 AM GMT
యంగ్ హీరో కోసం మిస్ ఢిల్లీ ఫిక్స్
X
పూరి జగన్నాధ్ 'మెహబూబా' తో తన కుమారుడు ఆకాష్ కు హీరోగా మంచి బ్రేక్ ఇవ్వాలని ట్రై చేసినా అంది వర్క్ అవుట్ కాలేదు. అసలే పూర్ ఫామ్ లో ఉండడంతో తనలిస్టులో కూడా మరో ఫ్లాప్ వచ్చి చేరింది. 'మెహబూబా' తర్వాత ఇంతవరకూ పూరి నెక్స్ట్ సినిమా ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఆకాష్ పూరి రెండో సినిమాకు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది.

ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అనిల్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జోరుగా జరుగుతున్న ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయిందట. ఈ సినిమాలో ఆకాష్ కు జోడీగా మిస్ ఢిల్లీ కిరీటం గెలిచిన బ్యూటీ గాయత్రి భరద్వాజ్ ను ఫైనలైజ్ చేశారట. అందాల భామలను వెతికి పట్టుకుని తెలుగు తెరకు పరిచయం చేయడంలో పూరి జగన్నాధ్ టీమ్ టాలెంట్ మనకు తెలిసిందే. మరి ఈ సారి తన కుమారుడి కోసం మరో అందాల భామను ఎంచుకున్నాడు.

ఈ సినిమా కూడా ఒక పవర్ ఫుల్ లవ్ స్టొరీ అని.. ఈ సినిమాతో ఆకాష్ కు తప్పని సరిగా విజయం లభిస్తుందని పూరి జగన్నాధ్ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.