Begin typing your search above and press return to search.

సన్నాఫ్ పూరి: మెచ్యూర్డ్.. రఫ్ లుక్ లో ఉన్నాడే!

By:  Tupaki Desk   |   7 Feb 2019 5:10 AM GMT
సన్నాఫ్ పూరి: మెచ్యూర్డ్.. రఫ్ లుక్ లో ఉన్నాడే!
X
పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి తెలుసు కదా. 'ఆంధ్రాపోరి'.. 'మెహబూబా' చిత్రాలలో హీరోగా నటించాడు. బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించిన ఆకాష్ కు కెమెరా ముందుకు రావడం కొత్తేమీ కాదు కాబట్టి నటనలో ఈజ్ ఉంది. టీనేజ్ లో ఉన్నప్పుడే 'ఆంధ్రపోరి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత నాన్నగారి డైరెక్షన్లోనే 'మెహబూబా' తో రీలాంచ్ అయ్యాడు. ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది.

నిజానికి పూరి తన లాస్ట్ సినిమా 'మెహబూబా' తర్వాత మరో సినిమాను ఆకాష్ తోనే చేస్తానని ప్రకటించాడు కానీ ఎందుకో ఆ ఆలోచనను విరమించుకుని హీరో రామ్ తో సినిమా చేస్తున్నాడు. మరి ఆకాష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆకాష్ పూరి గోల్ అయితే హీరోగా తన సత్తా చాటడమే. మరి తన నెక్స్ట్ సినిమాను నాన్నగారి డైరెక్షన్లోనే చేస్తాడో లేదో తెలియదు గానీ ఈమధ్య ఒక ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. గతంలో మరీ పసిగా కన్పించే ఆకాష్ ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ గా కనబడుతున్నాడు. కాస్త రఫ్ నెస్ కూడా ఉంది. ఈ ఫోటో షూట్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సే వస్తోంది.

ఈ లెక్కన ఆకాష్ నెక్స్ట్ సినిమాను 'మెహబూబా'ను డైరెక్ట్ చేసిన ఫామ్ లో లేని 'కొత్త' పూరి జగన్నాధ్ లాగ కాకుండా హీరోలలో కొత్త యాంగిల్ చూపించే 'పాత' పూరి డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. మరి పూరినే ఆకాష్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తాడా లేదంటే బయట రూమర్లు ప్రచారంలో ఉన్నట్టు మరో యువ దర్శకుడి చేతిలో పెడతాడా అనేది వేచి చూడాలి.