Begin typing your search above and press return to search.

నా తండ్రిని లాంచ్ చేస్తున్నా...ఆకాశ్ పూరీ!

By:  Tupaki Desk   |   6 May 2018 9:38 AM GMT
నా తండ్రిని లాంచ్ చేస్తున్నా...ఆకాశ్ పూరీ!
X
పూరీ జ‌గ‌న్నాథ్....ఒకప్పుడు ఈ టాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కోసం అగ్ర హీరోలు కూడా క్యూట్టిన సంద‌ర్భాలున్నాయి. అయితే, ప్ర‌స్తుతం వ‌రుస ప్లాప్ ల‌తో స‌త‌మ‌వుతోన్న పూరీ జ‌గ‌న్నాథ్ తో సినిమా చేసేందుకు కొంద‌రు హీరోలు మొఖం చాటే ప‌రిస్థితి ఉంది. టెంప‌ర్ త‌ర్వాత స‌రైన హిట్ లేక ఇబ్బంది ప‌డుతోన్న పూరీ....పైసా వ‌సూల్ డిజాస్ట‌ర్ తో డ‌ల్ అయిపోయాడు. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో త‌న కొడుడు ఆకాశ్ పూరీని హీరోగా పెట్టి `మెహ‌బూబా`ను తెర‌కెక్కించాడు. ఈ సినిమా గురించి పూరీ తోపాటు...ఆకాశ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాతో త‌న తండ్రిని లాంచ్ చేస్తున్నాన‌ని ఆకాశ్ ఓ ప్రెస్ మీట్ లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది త‌న తండ్రికి క‌మ్ బ్యాక్ మూవీ అని, ఈ సినిమా త‌ర్వాత ఓ కొత్త పూరీ జ‌గ‌న్నాథ్ ను చూస్తార‌ని ఆకాశ్ అన్నాడు.

త‌న సినిమా `మెహ‌బూబా`పై ఆకాశ్ పూరీ చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. అందుకే...ఈ సినిమా ద్వారా హీరోగా త‌న‌ను త‌న తండ్రి లాంచ్ చేయ‌డం లేద‌ని....తానే పూరీజ‌గ‌న్నాధ్ ను లాంచ్ చేయ‌బోతున్నాన‌ని కాన్ఫిడెంట్ గా అన్నాడు. త‌న తండ్రి పూరీ....ఇపుడు క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉన్నాడ‌ని...ఈ సినిమాతో హిట్ కొట్టి మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాడ‌న్న అర్థంలో ....ఆకాశ్ ఆ కామెంట్స్ చేసి ఉంటాడు. అదీగాక‌....పూరీ రొటీన్ స్టోరీల‌కు భిన్నంగా ఈ ల‌వ్ స్టోరీ తెరెక్క‌నుండ‌డం....ఇండోపాక్ బోర్డ‌ర్ నేప‌థ్యంలో క‌థ సాగ‌డం...వంటి కార‌ణాల‌తో సినిమాపై హైప్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే విడుద‌లైన థియాట్రిక‌ల్ ట్రైల‌ర్ లో కూడా సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. మ‌రి, పూరీ ఆకాశ్ చెప్పిన‌ట్లు ...త‌న తండ్రిని ఈ సినిమాతో లాంచ్ చేశాడో లేదో చూడాలంటే 11వ తారీకు వ‌ర‌కు వేచి చూడాల్సిందే.