Begin typing your search above and press return to search.

RRR సీత స్నేహితురాలు బీచ్ దొరికితే క్ష‌మించ‌దు!

By:  Tupaki Desk   |   14 March 2021 8:00 AM IST
RRR సీత స్నేహితురాలు బీచ్ దొరికితే క్ష‌మించ‌దు!
X
ఆకాంక్ష రాంజ‌న్ కపూర్ ..ఇటీవ‌ల వెబ్ లో వైర‌ల్ గా మారిన పేరు ఇది. అంత‌గా ఈ అమ్మ‌డిలో ఏం ఉంది? అంటే .. ఇదిగో ఇదే ప్రాక్టిక‌ల్ ఆన్స‌ర్. బీచ్ క‌నిపిస్తే చాలు చెల‌రేగిపోవ‌డం ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌.ఆర్.ఆర్.ఆర్ ఆలియాకి ఈ బ్యూటీ క్లోజ్ ఫ్రెండ్. నిరంత‌రం ఆలియా అండ్ గాళ్స్ గ్యాంగ్ తో క‌లిసి బీచ్ విహారంలో ర‌చ్చ చేస్తుంటుంది. ఇంత‌కుముందు ఆలియా- ఆకాంక్ష‌ అండ్ గ్యాంగ్ ర‌చ్చకు సంబంధించిన చాలా ఫోటోలు అంత‌ర్జాలంలో నిప్పు పెట్టాయి.

గత కొన్ని నెలలుగా ఆకాంక్ష అన్ లిమిటెడ్ ఇన్ స్టా ట్రీట్ సంచ‌ల‌నంగా మారుతోంది. తన తొలి వెబ్ చిత్రం గిల్టీ విడుదలైంది మొద‌లు ఆకాంక్ష‌కు భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక త‌న గాళ్స్ ముఠాతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం.. స్నేహితురాలు అలియా భట్ తో ఆన్ ‌లైన్ ‌ట్రోలింగులు ఎదుర్కోవడం వ‌గైరా మ్యాట‌ర్స్ ‌తోనూ హాట్ టాపిక్ గా మారింది.

2020లో గిల్టీ అనే వెబ్ చిత్రంతో తన నటన కెరీర్ ని ప్రారంభించిన ఆకాంక్ష అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ ఆఫ‌ర్ల కోసం ఆస‌క్తిగా వేచి చూస్తోంద‌ట‌. గ‌త ఏడాది ఈ అమ్మ‌డి లైఫ్ భావోద్వేగాల‌తో ముడిప‌డిందిట‌. ఓవైపు న‌టిగా కెరీర్ ఆరంభించిన ఆనందంలో ఉన్నా... త‌న‌ తండ్రికి కోవిడ్ -19 నిర్ధారణ అవ్వ‌డంతో చాలా క‌ల‌త‌కు గురైంది. ఇక సోష‌ల్ మీడియాల్లో ఆకాంక్ష రాంజాన్ లేటెస్ట్ ఫోటోషూట్ అగ్గి రాజేస్తోంది. ఈ భామ మాల్దీవుల విహారంలో పూల్ సైడ్ స్విమ్ సూట్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ప్ర‌స్తుతం ఈ హాటెస్ట్ ఫోటో వెబ్ లో అంత‌కంత‌కు వేడి పెంచేస్తోంది. టూపీస్ లో క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ట్రీట్ ఇచ్చింది! అంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.