Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాతే దూసుకెళుతోందట!

By:  Tupaki Desk   |   26 Sep 2019 4:49 AM GMT
పెళ్లి తర్వాతే దూసుకెళుతోందట!
X
పెళ్లి సంగతి తర్వాత పాతిక దాటితే చాలు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవటం నాటి మాట. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది పలువురి హీరోయిన్ల కెరీర్. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అన్న తేడా లేకుండా దూసుకెళ్లిపోతున్న నటీమణులకు కొదవ లేదు. గతానికి భిన్నంగా హీరోయిన్ పెళ్లి విషయాన్ని పట్టించుకోవటం మానేశారు ప్రేక్షకులు. ఇందుకు చాలానే ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా సుదీప్ తో మెరిసిన పహిల్వాన్ భామ కూడా ఇదే కోవకు చెందిన వారు.

నాగ్ తో దేవదాస్ తో జతకట్టినా.. మళ్లీరావాలో సుమంత్ తో జోడీ కట్టిన ఆకాంక్షా సింగ్ ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. జైపూర్ లో పుట్టి పెరిగిన ఈ భామకు ఇన్ స్టాలో అత్యధిక ఫాలోయర్లు తెలుగువారు.. అందునా హైదరాబాదీయులేనని చెప్పింది. తెలుగులో మరింత కాలం పని చేయాలని అమ్మడు అనుకుంటుందట. ఇప్పటివరకూ చేసినవి హోమ్లీ క్యారెక్టర్లే అయినా.. పహిల్వాన్ లో మాత్రం తొలిసారి గ్లామర్ రోల్ ప్లే చేశానని.. అలాంటి పాత్రలైనా తనకు ఫర్లేదంటోంది.

తన వ్యక్తిగత విషయాల్ని చెప్పుకొస్తూ.. పెళ్లికి.. సినిమా కెరీర్ కు అస్సలు లింకు అక్కర్లేదని.. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతోంది. అందుకు తానే పెద్ద ఉదాహరణగా పేర్కొంది. సినిమా రంగమే కాదు.. ఏ రంగంలోనూ పెళ్లి అస్సలు అడ్డంకే కాదన్న ఈ బ్యూటీ.. నిజానికి తన పెళ్లి తర్వాతే తన కెరీర్ దూసుకెళుతోందని చెప్పింది.

తన భర్త కునాల్ నటుడు కాకున్నా.. నటిగా తనను ప్రోత్సహిస్తారని పేర్కొంది. తానింత యాక్టివ్ గా పని చేస్తున్నానంటే కారణం.. తన భర్త నుంచి లభించే ప్రోత్సాహమేనని స్పష్టం చేసింది. ఆమె కోరుకున్నట్లే మరిన్ని సినిమాల్లో మెరిసిపోవాలని కోరుకుందాం.