Begin typing your search above and press return to search.

దేవ‌దాస్ స‌ఖియ పిలుస్తోందిలా

By:  Tupaki Desk   |   17 Sep 2018 7:41 AM GMT
దేవ‌దాస్ స‌ఖియ పిలుస్తోందిలా
X
చాలా రోజుల త‌ర్వాత నా ప‌క్క‌న ఓ అంద‌మైన అమ్మాయి ప‌రిచ‌య‌మైంది! అంటూ కింగ్ నాగార్జున ఓ అమ్మాయిని ప‌రిచ‌యం చేశారు. అమ్మాయి అందంగానే ఉంది. నాగ్ స‌ర్ అభిరుచికి త‌గ్గ‌ట్టే క్యూట్‌ గా - ల‌వ్‌ లీగా - సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ఉంది. ఇదివ‌ర‌కూ `సోగ్గాడే చిన్నినాయ‌నా` చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి లాంటి అంద‌గ‌త్తెకు ఛాన్సిచ్చారు నాగ్‌. అంతెందుకు `సూప‌ర్‌` సినిమాతో అనుష్క లాంటి అంద‌గ‌త్తెను తెచ్చింది నాగార్జున‌నే. కెరీర్‌ లో ఎంద‌రో అంద‌గ‌త్తెల్ని తెలుగుతెర‌కు ప‌రిచ‌యం చేశారు. ర‌మ్య‌కృష్ణ‌ - మ‌నీషా కొయిలారా - న‌గ్మ‌ - ట‌బు వంటి గొప్ప అంద‌గ‌త్తెల్ని - పెర్ఫామ‌ర్స్‌ కి అవ‌కాశాలిచ్చి పెద్ద స్టార్ల‌ను చేసిన ఘ‌న‌త నాగార్జున‌దే. శ్రీయ‌ - గౌత‌మి వంటి భామ‌ల‌కు కెరీర్‌ లో కీల‌క‌మైన‌ ఛాన్సులిచ్చారు నాగ్‌.

అందుకే ఇప్పుడు ప‌రిచ‌యం చేసిన ఈ కొత్త అంద‌గత్తె ఎవ‌రు? అంటూ అంతా చెవులు రిక్కించి - క‌ళ్లు పెద్ద‌వి చేసుకుని మ‌రీ చూశారు. పేరు ఆకాంక్ష‌. దేవ‌దాస్ చిత్రంలో జాహ్న‌వి పాత్ర‌లో న‌టిస్తోంది. పేరుకు త‌గ్గ‌ట్టే ఎంతో అందంగా కాటుక క‌ళ్ల పంక‌జాక్షిలా క‌నిపిస్తోంది. హాయ్! అంటూ కుర్రాళ్ల‌ను ఫ్లర్ట్ చేసింది పోస్ట‌ర్‌ లో. నాగ్ స‌ర్ టేస్టే వేరు! సెప్టెంబ‌ర్ 27న ఎలానూ దేవ‌దాస్ సినిమా వ‌చ్చేస్తోంది కాబ‌ట్టి నేరుగా థియేట‌ర్ల‌లోనే ఆకాంక్ష‌ను చూసేయొచ్చు.

అన్న‌ట్టు నాగ్ ఈ అందాన్ని ప‌రిచ‌యం చేయ‌గానే ఒక వీరాభిమాని ఏమ‌న్నాడో తెలుసా? ఈ అమ్మాయి కంటే అంద‌మైన అమ్మాయా సార్‌? అంటూ `అనుష్క‌- నాగార్జున` కాంబో ఫోటోని ఇన్‌ స్టాలో షేర్ చేశాడు. ఇక కౌశ‌ల్ ఆర్మీ అంటూ ప‌లువురు ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో దాస్ నానిని చెడామ‌డా తిట్టేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. మొత్తానికి మ‌రో కొత్త‌మ్మాయిని నాగ్ స‌ర్ ప‌రిచ‌యం చేస్తున్నారు. అదీ సంగ‌తి!