Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ షో..!

By:  Tupaki Desk   |   8 Jan 2023 5:50 AM GMT
ఫోటో స్టోరీ : బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ షో..!
X
బాలీవుడ్ సీరియల్స్ లో మెప్పించిన ఆకాంక్ష సింగ్ ఆ టైం లోనే తన స్నేహితుడు కునాల్ సైన్ ని పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ చేస్తూ వచ్చిన అమ్మడికి సినిమా ఛాన్స్ లు వచ్చాయి. బాలీవుడ్ లో బద్రినాథ్ కి దుల్హనియా సినిమాలో నటించిన అమ్మడు ఆ తర్వాత తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా సినిమాతో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా హిట్ అవడంతో నాగార్జున నటించిన దేవదాస్ సినిమాలో నాగ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత కన్నడలో ఒక సినిమా హిందీలో ఒక సినిమా చేసిన ఆకాంక్ష సింగ్ తెలుగులో మరోసారి క్లాప్ సినిమాతో మెప్పించింది. రీసెంట్ గా హీరో నాని సిస్టర్ దీప్తి డైరెక్ట్ చేసిన మీట్ క్యూట్ లో కూడా నటించింది ఆకాంక్ష సింగ్.

లాస్ట్ ఇయర్ తమిళ్ లో ఒక సినిమా హిందీలో ఒక సినిమా చేసిన ఆకాంక్ష సింగ్ పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ లో మంచి దూకుడు చూపిస్తుంది. ఇక సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా ఆకాంక్ష హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం ప్రతి హీరో సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆకాంక్ష సింగ్ కూడా వారిని అలరించేందుకు ఫోటో షూట్స్ తో మెప్పిస్తుంది. గ్లామర్ విషయంలో నో లిమిట్స్ అనేలా ఉన్న ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో థై షోస్ చేస్తూ స్లీవ్ లెస్ అందాలతో రెచ్చిపోయింది ఆకాంక్ష సింగ్.

ముంబైలో ఒక సినిమా ప్రీమియర్ కు అటెండ్ అయిన అమ్మడు అక్కడ మీడియాని ఎట్రాక్ట్ చేసింది. ఆకాంక్ష సింగ్ ని అలా చూసిన కెమెరా లు అన్ని క్లిక్ అనిపించాయి. సరైన పాత్ర వస్తే మాత్రం ఆకాంక్ష తన టాలెంట్ మొత్తం చూపించేలా ఉందని చెప్పొచ్చు. తెలుగుతో పాటుగా హిందీ సినిమాల్లో కూడా రాణిస్తున్న ఆకాంక్ష సింగ్ ఇక మీదట కెరీర్ లో మరింత దూకుడు చూపించాలని చూస్తుంది. తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నా ఆచి తూచి అడుగులేస్తుంది ఆకాంక్ష సింగ్.

తన మదర్ థియేటర్ ఆర్టిస్ట్ అవడంతో ఆ లెగసీ తోనే ఆకాంక్ష సింగ్ సినిమాల్లో తనకు ఇచ్చిన ప్రతి పాత్రతో మెప్పిస్తూ వస్తుంది. పెళ్లి అయింది కదా గ్లామర్ విషయంలో వెనకడుగు వేస్తుందేమో అనుకుంటే మాత్రం పొరబడినట్టే.. గ్లామర్ ట్రీట్ లో కూడా ఆకాంక్ష సింగ్ వెనక్కి తగ్గేదేలేదని ప్రూవ్ చేస్తుంది. అమ్మడిలోని ఈ టాలెంట్ ని ఇంకా దర్శక నిర్మాతలు గుర్తించలేదని చెప్పాలి. కెరీర్ లో ఒక సూపర్ హిట్ పడితేనే కానీ అమ్మడికి స్టార్ రేంజ్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.