Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ కోసమూ ఓ వీడియో.. ‘ఏకే’ టీమ్ ప్లానింగ్

By:  Tupaki Desk   |   22 Dec 2020 5:30 PM GMT
త్రివిక్రమ్ కోసమూ ఓ వీడియో.. ‘ఏకే’ టీమ్ ప్లానింగ్
X
‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీకి సంబంధించి కొన్ని రోజులుగా కొనసాగుతున్న సెకండ్ హీరో సస్పెన్స్ ముగిసింది. తొలి నుంచీ కొనసాగిన ప్రచారాన్ని నిజం చేస్తూ ‘ఏకే’ టీమ్ లో రానా చేరిపోయాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. మూవీ మేకర్స్ ఒక వీడియో బైట్‍ కూడా విడుదల చేశారు.

అయితే.. ఈ సినిమాలో హీరోలు పవన్‍, రానా అని తేలిపోయింది. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అందరరికీ తెలిసిందే. కానీ.. ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్‍ పేరు మాత్రం ఇంకా టెక్నీషియన్ల జాబితాలో చేర్చలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ మాటలు రాస్తున్నారనేది ఓపెన్‍ సీక్రెట్‍. కానీ త్రివిక్రమ్‍ పేరు ఎందుకు అధికారికంగా ప్రకటించలేదనే చర్చ సాగుతోంది.

అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నటించే పవన్‍, రానాకు వెల్‍కమ్‍ చెబుతూ ఎలాగయితే స్పెషల్‍ వీడియోలు విడుదల చేశారో.. త్రివిక్రమ్‍ కోసం కూడా అలాగే వీడియోతో వెల్కం చెబుతారని టాక్. తమన్‍ బ్యాక్‍గ్రౌండ్‍ మ్యూజిక్‍తో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్‍ ఇస్తారని సమాచారం.

కాగా.. ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ కేవలం మాటలు రాయడం మాత్రమే కాకుండా.. స్క్రీన్‍ప్లే రైటర్‍ గా కూడా పనిచేయనున్నట్లు తెలిసింది. అందుకే ఆయన ఎంట్రీని ఘనంగా ప్రకటిస్తారట. అగ్రదర్శకుల జాబితాలో ఉన్న త్రివిక్రమ్ పేరును సింపుల్ గా టెక్నీషియన్ల జాబితాలో చేర్చేయకుండా… ప్రత్యేకమైన ఎలివేషన్‍ ప్లాన్‍ చేసుకుంటున్నారన్నమాట.