Begin typing your search above and press return to search.

ఆ టీజర్ విషయంలో ఎంత టెన్షనో..

By:  Tupaki Desk   |   17 Feb 2017 10:46 AM GMT
ఆ టీజర్ విషయంలో ఎంత టెన్షనో..
X
ప్రస్తుతం ఓ తమిళ టీజర్ కోసం ఆ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆ హీరో అభిమానులు చాలా ఉత్కంఠతో ఉన్నారు. ఆ హీరో యాంటీ ఫ్యాన్స్ కూడా అంతే ఉత్కంఠతో ఉన్నారు. ఆ టీజర్ రావడం ఆలస్యం అందులో నెగెటివ్స్ వెతకడానికి వాళ్లు చాలా ఆసక్తితో ఉన్నారు. ఇంతకీ ఆ టీజర్ ఏ సినిమాది అంటారా..? స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘వివేగం’.

కొన్ని వారాల పాటు ఊరించి ఊరించి గత నెలలోనే ‘వివేగం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన అజిత్ ను చూసి మొదట అందరూ ఆహా ఓహో అన్నారు కానీ.. ఇది మార్ఫ్డ్ ఫొటో లాగా ఉందే అన్న సందేహాలు వ్యక్తమయ్యాక సీన్ మారిపోయింది. విజయ్ ఫ్యాన్స్ ఇది పక్కా మార్ఫ్డ్ పిక్ అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో అజిత్ ను ఓ రేంజిలో ట్రోల్ చేశారు. ఇది నిజంగా అజిత్ ఒరిజినల్ లుక్ అయితే.. వర్కవుట్ వీడియోలు రిలీజ్ చేయాలని.. మరో లుక్ వదలాలని.. డిమాండ్ చేశారు. ఐతే ఈ సవాళ్లపై.. విమర్శలపై.. ఆరోపణలపై చిత్ర బృందం ఒక్క మాటా మాట్లాడలేదు.

తాజా సమాచారం ప్రకారం ‘వివేగం’ ఫస్ట్ టీజర్ రెడీ అవుతోందట. అతి త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తారట. ఈ టీజరే అన్నింటికీ సమాధానం అవుతుందని అజిత్ అండ్ కో భావిస్తోంది. తల ఫ్యాన్స్ కూడా ఆ ఆశతోనే ఉత్కంఠగా టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. బహుశా ఈ టీజర్లో అజిత్ సిక్స్ ప్యాక్ కు సంబంధించి అథెంటిక్ లుక్ చూపిస్తారని భావిస్తున్నారు. మరి అది చూసి విజయ్ ఫ్యాన్స్ ఎలా రెస్పాండవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/