Begin typing your search above and press return to search.

ఒక్క పోస్టర్ తో ఇనిస్పిరేషన్ అయ్యాడు

By:  Tupaki Desk   |   3 Feb 2017 9:06 AM GMT
ఒక్క పోస్టర్ తో ఇనిస్పిరేషన్ అయ్యాడు
X
తమిళ స్టార్ అజిత్ కొత్త సినిమాక వివేకం. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా రివీల్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ హెయిర్ స్టైల్ ని మెయింటెయిన్ చేసిన అజిత్.. చిజిల్డ్ 6 ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేసేశాడు. 'బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్' అంటూ పెట్టిన క్యాప్షన్ కు తగినట్లుగానే తల లుక్స్ అదిరిపోయాయి.

అజిత్ కొత్త సినిమా లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు. మరోవైపు టాలీవుడ్ కోలీవుడ్ హీరోలు కూడా.. అజిత్ చూపించిన మేకోవర్ కి మెస్మరైజ్ అయిపోతున్నారు. బాహుబలి సిరీస్ కోసం ఎన్నో వర్కవుట్స్ చేసిన దగ్గుబాటి రానా కూడా.. వివేకంలో అజిత్ లుక్ చూసి ఫ్లాట్ అయిపోయాడు. 'వావ్.. వావ్.. వావ్.. ఔట్ స్టాండింగ్.. మోటివేషన్ అంటే ఇది.. ఇన్ స్పిరేషన్ అంటే ఇది. అద్భుతమైన డెడికేషన్. అజిత్ సార్.. మీరు నిజంగా రాక్ స్టార్' అంటూ ట్వీట్ చేశాడు భల్లాలదేవుడు.

కోలీవుడ్ హీరో ధనుష్ అయితే.. తన స్టైల్ లో రెచ్చిపోయాడు. 'టైమింగ్ అదిరింది.. తల ఫ్యాన్స్.. ఏంటీ రెడీ యా?' అంటూ క్వశ్చన్ చేస్తే.. 'ఓ యస్' అంటూ వేలకొద్దీ రిప్లైలు వచ్చాయి. మరో తమిళ హీరో విక్రమ్ ప్రభు 'ఎంత బాధ కలిగినా పనిలో సక్సెస్ కాగలం అని మిమ్మల్ని మీరు నమ్మండి. అజిత్ సార్.. దర్శకుడు శివలకు వివేకంతో హ్యాట్రిక్ అందాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. స్టార్లకే ఇన్ స్పిరేషన్ అయిపోతున్నాడంటే.. అజిత్ నిజంగా కేక అంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/