Begin typing your search above and press return to search.

త‌ళా 'విశ్వాసం' లీక్ లీక్

By:  Tupaki Desk   |   28 Sep 2018 8:06 AM GMT
త‌ళా విశ్వాసం లీక్ లీక్
X
త‌ళా `ప్రేమ‌లేఖ‌ అజిత్‌`గానే ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ఉన్నాడు. ఇటీవ‌లే గ్యాంబ్ల‌ర్ - ఆరంభం - వీరం - వివేకం - ఎంత‌వాడు గానీ..(గౌత‌మ్ మీన‌న్) చిత్రాల‌తోనూ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. అందుకే అజిత్ న‌టిస్తున్న తాజా చిత్రం `విశ్వాసం`పై అటు త‌మిళ మార్కెట్‌ తో పాటు - టాలీవుడ్‌ మార్కెట్‌ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. త‌న‌కు వ‌రుస విజ‌యాల్ని అందిస్తున్న ద‌రువు శివ‌తో అజిత్‌ కి ఇది నాలుగో సినిమా. వీరం - వేదాలం - వివేగం వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ల త‌ర్వాత శివ‌తో కలిసి అజిత్ ప‌ని చేస్తున్నారు. ఒక స్టార్ హీరోని వ‌రుస‌గా నాలుగు సినిమాల‌కు లాక్ చేసిన క్రెడిట్ కూడా మ‌న తెలుగువాడైన ఛాయాగ్రాహ‌కుడు కం ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ‌కు ద‌క్కుతుంది. విశ్వాసం చిత్రాన్ని శివ అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని తెర‌కెక్కిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.

ప్ర‌స్తుతం ఈ మూవీ హైద‌రాబాద్‌ లో తెర‌కెక్కుతోంది. రెండో షెడ్యూల్ ఏకంగా నెల‌రోజుల పాటు భారీగా ఇక్క‌డే ప్లాన్ చేశారు. అయితే ఆన్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫోటోలు లీక‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. అజిత్ ఫ్యాన్స్‌ సామాజిక మాధ్య‌మాల్లో `విశ్వాసం` లీక్డ్ ఫోటోల హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి. అజిత్ ఓ భారీ షాపింగ్ మాల్‌లో ప్ర‌వేశిస్తున్న‌ప్ప‌టి ఫోటోలు ఆక‌ర్ష‌ణ పెంచాయి. ఇందులో అజిత్ య‌థావిధిగా అదే పండిన గ‌డ్డం - నెరిసిన జుత్తు - పంచెక‌ట్టుతో రియ‌ల్ మాస్ తంబీనే త‌ల‌పిస్తున్నాడు. ఇక విశ్వాసం చిత్రీక‌ర‌ణ కోసం హై ఎండ్ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నారు. ఆన్ లొకేషన్ ఓ ఫ్లైయింగ్ రిమోట్ చాప‌ర్ ఎగురుతున్న‌ప్ప‌టి దృశ్యాన్ని వీడియో తీసి ఆన్‌ లైన్‌ లో లీక్ చేశారు త‌ళా ఫ్యాన్స్. ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

మ‌రోవైపు `విశ్వాసం` చిత్రం కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల వీరాభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వీరాభిమాని అభిమాని కోసం ఎంత‌గా చెవి కోసుకుంటాడో చెప్పే ఎగ్జాంపుల్ ఫ్యాన్ సైట్‌ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఓ బైక్‌ పై అజిత్ ఫోటోల పోస్ట‌ర్ల‌ను అతికించి ఆ పోస్ట‌ర్ల‌ను క‌సిగా ముద్దాడేస్తూ క‌నిపించాడో ఫ్యాన్‌. వేరొక వీరాభిమాని అయితే అజిత్ పోస్ట‌ర్ల‌కు పాలాభిషేకం చేస్తున్నాడు. ఈ ఫోటోలు అజిత్ ఫ్యాన్స్ సామాజిక సైట్‌(ThalaAjith_FC/status)లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఓ ర‌కంగా అజిత్ ఫ్యాన్స్ వేలం వెర్రి షాకిస్తోందంటే న‌మ్మండి. నవంబ‌ర్ 20న విశ్వాసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఆ మేర‌కు షూటింగ్‌ ని వేగంగా పూర్తి చేస్తున్నారు. `వివేగం` నిర్మాణ సంస్థ‌ స‌త్య‌జ్యోతి ఫిలింస్‌ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిస్తోంది.