Begin typing your search above and press return to search.

#ఫ‌స్ట్ లుక్ రెడీ.. CBCID ఈశ్వరమూర్తిగా త‌ళా?

By:  Tupaki Desk   |   25 Jun 2021 5:30 AM GMT
#ఫ‌స్ట్ లుక్ రెడీ.. CBCID ఈశ్వరమూర్తిగా త‌ళా?
X
2021 మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది? అంటే ఆర్.ఆర్.ఆర్ - పుష్ప‌- ఆచార్య‌- స‌ర్కార్ వారి పాట- బీస్ట్ ఇలా నాలుగైదు పేర్లు చెబుతాం. కానీ వీట‌న్నిటికీ ధీటుగా త‌ళా అజిత్ న‌టిస్తున్న `వాలిమై` కూడా రేస్ లో ఉంది. ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో అజిత్ అభిమానుల హంగామా చూస్తుంటే ఔరా! అని ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేం.

వాలిమైలో ఈశ్వర మూర్తి అనే సిబిసిఐడి అధికారిగా తళా అజిత్ నటించాడని మీడియాలో ఇటీవల చర్చనీయాంశమైంది. ఇక‌పోతే త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ లాంచ్ కానుంద‌ని ప్ర‌క‌టించేందుకు చిత్ర‌బృందం రెడీ కావ‌డంతో సోష‌ల్ మీడియాల్లో అజిత్ అభిమానుల ర‌చ్చ పీక్స్ కి చేరుకుంది. 2021 లో మోస్ట్ అవైటెడ్ మూవీ వాలిమై అంటూ ప్ర‌చారం సాగుతోంది. ఇక ఇందులో అజిత్ బైక్ రేస‌ర్ గానూ క‌నిపిస్తార‌న్న టాక్ ఉంది.

వాలిమై కొద్ది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. నీరవ్ షా కెమెరా వ‌ర్క్ అందిస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి - జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహమ్మారి సెకండ్ వేవ్ నుండి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మిగిలిన భాగాలను చిత్రీకరించడానికి మేకర్స్ విదేశాలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు చిత్ర‌బృందం చెబుతోంది. `వాలిమై` ఈ దీపావళి కానుక‌గా విడుదల కానుంది.